గౌరీలంకేష్ కాల్చివేత: హైదరాబాద్‌లో నిరసన, నివేదిక కోరిన కేంద్రం

కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యను హైదరాబాద్ జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. బషీర్ బాగ్ చౌరస్తాలో గౌరీ లంకేష్ హత్యను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాద్/న్యూఢిల్లీ: కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యను హైదరాబాద్ జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. బషీర్ బాగ్ చౌరస్తాలో గౌరీ లంకేష్ హత్యను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

చదవండి: ఈ హత్యలు ఏం చెప్తున్నాయి: 'ఒకే రకంగా గౌరీలంకేష్-కల్బుర్గీ హత్యలు'

హత్యపై విచారణ జరిపించి హత్య వెనుక ఉన్న వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన మూడు హత్యలపై ఇప్పటి వరకు స్పందించని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, పలు పార్టీల నేతలు తరలి వచ్చారు.

Home Minister Rajnath Singh Seeks Report on Gauri Lankesh's Murder From Karnataka Government

నివేదిక కోరిన కేంద్రహోంశాఖ

సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్యకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ హోం సెక్రటరీ రాజీవ్ గవుబాను ఆదేశించారు.

చదవండి: బెంగళూరులో ఘోరం: మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్య

హత్య వివరాలు, హంతకులను పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా వివరాలు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.

గౌరీ లంకేష్ హత్య వెనుక కుట్ర కోణం ఉందా లేదా అనేది తాను ఇప్పుడే చెప్పలేదని, ఇటీవల తాను గౌరీ లంకేశ్‌ను కలిసినప్పుడు తనకు ఎలాంటి ప్రాణిహాని ఉన్న విషయాన్ని తనకు చెప్పలేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కల్బుర్గి, పన్సారే, దభోల్కర్ హత్యలకు ఉపయోగించిన తరహా ఆయుధాలనే ఈ హత్యకూ వాడారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+