ఊరేళ్తున్నాం.. డబ్బు, నగలు తీసుకెళ్లాం! దొంగలకు ఇంటి యజమాని నోట్!!
హైదరాబాద్ నగరం నుంచి పండగలు జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్లిన సమయంలో ఇక్కడి నివాసాల్లో దొంగలు తమ చేతివాటాను చూపిస్తున్న విషయం తెలిసిందే. సొంతూళ్లకు పండగల కోసం వెళితే.. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం, నగలు దోచేస్తుంటారు. ఈ నేపథ్యంలో పండగలకు సొంతూళ్లకు వెళ్లే నగర ప్రజలకు పోలీసులు పలు సూచనలు కూడా చేశారు.
అయితే, తాజాగా, సంక్రాంతి పండగకు వెళ్లిన ఓ ఇంటి యజమాని తన ఇంటి తలుపునకు ఓ నోట్ రాసి పెట్టి వెళ్లాడు. అది కూడా దొంగలనుద్దేశించి కావడం గమనార్హం. తాము సంక్రాంతికి ఊరెళ్తున్నామని.. తమ ఇంట్లో ఏమీ లేవని దొంగలకు చెప్పాడు. అనవసరంగా దొంగతనానికి వచ్చి ప్రయాస పడవద్దని సూచించాడు.

'మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి' అని పేపర్‌పై రాసి డోర్‌కు అంటించారు సదరు యజమాని. అయితే, ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగలకు ఇలాంటి నోట్ రాసిన యజమాని వ్యవహారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
హైదరాబాద్ నగరం నుంచి సంక్రాంతి పండకు తమ సొంతూళ్లకు వెళ్లే నగర ప్రజలకు ఇప్పటికే పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు సగం నగర జనాభా సొంతూళ్లకు వెళ్లిన నేపథ్యంలో పోలీసులు కూడా రాత్రి సమయంలో గట్టి పహారా కాస్తున్నారు. దొంగలు పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడే అవకాశం ఉండటం పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టారు. అంతర్రాష్ట దొంగల ముఠాలు ఏమైనా రంగంలోకి దిగాయా? అనేదానిపై దృష్టి సారించారు. దోపిడీ దొంగల పని పట్టేందుకు నగర పోలీసులు కూడా అన్ని విధాలుగా సిద్ధమయ్యారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications