వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేనేటీగల దాడిలో గాయపడ్డ ఎమ్మెల్యే: గుహ లోపలికి వెళ్లే క్రమంలో..

నెరడుగొమ్ము మండలంలో ఉన్న గాజుపేట గుహలకు అరుదైన గుహలుగా పేరుండటంతో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

|
Google Oneindia TeluguNews

నల్లగొండ: దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తేనేటీగల దాడిలో గాయపడ్డారు. జిల్లాలో ఆకుపచ్చ గుహలుగా ప్రసిద్ది చెందిన గాజుపేట గుహలను సందర్శించడానికి అనుచరులతో కలిసి రవీంద్రకుమార్ వెళ్లారు.

టార్చ్ లైట్స్ ఆన్ చేసి గుహలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో ఒక్కసారిగా తేనేటీగలన్ని గుహ లోంచి బయటకొచ్చాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అతని అనుచరులు వాటి దాడిలో గాయపడ్డారు. మొహంపైన, చెంపల పైన రవీంద్రకుమార్ కు గాయాలయ్యాయి.

Honey bees attack on MLA Ravindra Kumar in Nalgonda

రవీంద్రకుమార్ తో పాటు వెళ్లిన కొంతమంది అనుచరులకు కళ్ల మీద గాయాలయ్యాయి. గాయపడిన రవీంద్రకుమార్ అనుచరులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ను దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమేమి లేదని రవీంద్రకుమార్

క్షేమంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

కాగా, నెరడుగొమ్ము మండలంలో ఉన్న గాజుపేట గుహలకు అరుదైన గుహలుగా పేరుండటంతో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఇక్కడి గుహలను పరిశీలించేందుకు వెళ్లారు. గుహలు ఉన్న ప్రాంతం అటవీ

ఏరియా కావడం.. చుట్టూ భయానక వాతావారణం ఉండటంతో గుహల లోపలికి ఎవరూ వెళ్లే సాహసం చేయరని స్థానికులు చెబుతున్నారు.

English summary
MLA Ravindra Kumar has been hospitalized after the attack of honey bees during the visit to 13th Century Caves at the Gajubedam forest area at Kacharajupalli Village of Neradugommu Mandal, Nalgonda District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X