న్యాయం చేయండి: కలెక్టర్, ఎస్పీలను కలిసిన ప్రణయ్ భార్య అమతృ, ఫ్యామిలీ
నల్గొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబసభ్యులు పోలీసులను కోరారు. ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను మంగళవారం ఎస్పీ రంగనాథ్ మీడియా ఎదుట ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం ప్రణయ్ భార్య అమృత వర్షిణి, అతని తల్లిదండ్రులు, సోదరుడు.. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్‌లను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలని కోరారు.

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు హామి ఇచ్చినట్లు తెలిసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 14న ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను సుభాష్ శర్మ అనే కిరాయి హంతకుడు కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. అమృత తండ్రే ఈ హత్య చేయించడం గమనార్హం. నిందితులందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications