Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం ? : కేంద్రంపై కేటీఆర్ ఫైర్

తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. గత ఏడున్నారేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారు. కానీ రాష్ట్రాలకు ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుంటే అది ఎలా సాద్యమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడ్డారు.

 హైదరాబాద్‌కు డ్రిల్‌మెక్ స్పా సంస్థ‌

హైదరాబాద్‌కు డ్రిల్‌మెక్ స్పా సంస్థ‌

దేశంలోని నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రంలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలంగాణలో సుమారు రూ. 15 వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్ స్పా ముందుకొచ్చింది. ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించనున్న డ్రిల్‌మెక్ స్పా పరిశ్రమతో దాదాపు 2500 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పరిశ్రమలో 80 శాతం వరకు స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు.

 రాష్ట్ర హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం

రాష్ట్ర హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం

రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసమని అన్నారు. రాష్ట్ర హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్రం తన వాగ్ధానాలను నిలబెట్టుకోవాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక రాయితీలు అందించాలని కోరారు.

Recommended Video

    Telangana : నిరుద్యోగులను, రైతులను కేసీఆర్ మోసం చేసాడు..కాంగ్రెస్ మౌన దీక్ష | Oneindia Telugu
     కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనం

    కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనం

    ఇటలీకి చెందిన డ్రిల్‌మెక్ స్పా హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించనుంది. అయిల్ డ్రిలింగ్, రిగ్గింగ్ సెక్టార్ ఎక్విప్ మెంట్ తయారీలో ఈ డ్రిల్‌మెక్ స్పా ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో సముద్రం తీరం లేదు.. అయిల్ రిజర్వలు లేవు. అయినా యూఎస్, ఇటలీ వంటి దేశాలను కాదని భారత్ లో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకోవడం శుభపరిణామని అన్నారు. అందులోనూ హైదారాబాద్ ను ఎంచుకుకోవడం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శమని కేటీఆర్ పేర్కొన్నారు..

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+