'బాలయ్యను సీఎం చేస్తేనే, మీడియా స్వేచ్ఛ గురించి కేసీఆర్ చెప్పటమా'

హైదరాబాద్: బాలకృష్ణను ముఖ్యమంత్రిని చేస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మశాంతిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ గురువారం అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చాలన్నారు.

షబ్బీర్ అలీ తెలంగాణ సీఎం కేసీఆర్ పైన కూడా నిప్పులు చెరిగారు. ఉద్యమకారులను వదిలి తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ పదవులు ఇస్తున్నారన్నారు. పోస్టింగ్, బదలీల్లో లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది హనీమూన్ ముగిసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలన్నారు.

ఇంటికో ఉద్యోగం మాట దేవుడు ఎరుగునని, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని ధ్వజమెత్తారు. రైతుల ఉసురుపోసుకుంటే చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు. తెరాస వచ్చాక వ్యవసాయం అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు.

How KCR talks about freedom of media: Congress

ఓటుకు వోటు వ్యవహారంలో కేసీఆర్ పైన మల్లు భట్టి విక్రమార్క గురువారం మాట్లాడారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి డబ్బు ఇవ్వజూపిన విషయంలో రేవంత్ రె్డిది తప్పైతే, గెలిచే సామర్థ్యం లేకపోయినా ఐదో ఎమ్మెల్సీని పోటీకి దింపిన కేసీఆర్‌దీ తప్పే అవుతుందన్నారు.

ప్రలోభాలతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోలేదని చెప్పగలరా అని ప్రశ్నించారు. డీఎస్పీని మధ్యవర్తిగా పెట్టి ఎమ్మెల్యేకు రూ.3 కోట్లు ఆఫర్ చేయడం తప్పుకాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను బెదిరించి, ప్రలోభ పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

రేవంత్ రెడ్డికి ఓ చట్టం, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు మరో చట్టమా అని నిలదీశారు. తెరాస పార్టీ ఫిరాయింపులను ఈసీ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. మీడియా స్వేచ్ఛ పైన మాట్లాడే హక్కు, అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. మీడియాకు 10కి.మీ. లోతున పాతిపెడతానన్న కేసీఆర్, మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సొంత మీడియాలో చూపిస్తే స్వేచ్ఛ, మిగిలిన మీడియాలో చూపిస్తే సంకెళ్లా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+