Congress: కాంగ్రెస్ ఎవరికెన్నీ టికెట్లు ఇచ్చిందంటే..!
కాంగ్రెస్ శుక్రవారం 45 మంది కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. అక్టోబర్ 15న 55 మందితో మొత్తంగా ఇప్పటి వరకు 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సామాజికవర్గాల వారీగా చూస్తే రెడ్డిలకు 33, బీసీలకు 18, వెలమలకు 8, కమ్మలకు 3, బ్రాహ్మణులకు 3, మైనారిటీలకు 4, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 స్థానాలు కేటాయించారు. బీసీలకు 35 ఇస్తామని చెప్పుకొస్తున్న కాంగ్రెస్.. ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 18 స్థానాలే.. మరో 19 చోట్ల 17 మంది బీసీలకు చోటు కల్పిస్తేనా.. 35 సీట్లు ఇచ్చినట్లు అవుతోంది.
కాంగ్రెస్ వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ ఖేడ్, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో 15 సీట్లలో స్క్రీనింగ్ కమిటీలో, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఏకాభిప్రాయం రాకపోవడం వాటి నిర్ణయాధికారాన్ని ఏఐసీసీకి అప్పగించారు.

పటాన్ చెరుకు సంబంధించి కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్ మధ్య పోటీ నెలకొంది. నీలం మధు ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరారు. ఆయన టికెట్ హామీతోనే కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తోంది. అటు టికెట్ ఆశించి భంగపడ్డవారు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తాజాగా కూకట్ పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళ్ రావు పార్టీకి రాజీనామా చేశారు.
వెంగళ్ రావు కూకట్ పల్లి టికెట్ ఆశించారు. కాంగ్రెస్ కొద్ది రోజుల క్రితమే పార్టీలోకి వచ్చిన బండి రమేష్ కు టికెట్ కేటాయించింది. వెంగళ్ రావు టికెట్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఉంటే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు జూబ్లీహిల్స్ సంబంధించి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ టికెట్ ను అజారుద్దీన్ కు కేటాయించారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications