ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు: ఐసీయూలో చీకట్లోనే, నోట్లో గుడ్డలతో, రాజేష్‌పై అనుమానమిలా..
నాగర్‌కర్నూల్: సుధాకర్‌రెడ్డిని చంపిన స్వాతి, రాజేష్‌లు అత్యంత పకడ్బందీగా ప్లాన్ వేశారు. తమ ప్లాన్‌ను సక్సెస్ అయ్యేలా చివరివరకు ప్రయత్నించారు. ఐసీయూలో చీకట్లోనే గడిపేందుకు రాజేష్ ప్రయత్నించేవాడు. తనను పరామర్శించేందుకు వచ్చే వారిని కలుసుకొనేందుకు ఆసక్తి చూపేవాడు కాదు. సుధాకర్ రెడ్డి స్నేహితుడు, సుధాకర్‌రెడ్డి తల్లి అనుమానాలు ఎట్టకేలకు నిజమమయ్యాయి.
Recommended Video

నాగర్‌కర్నూల్‌లో నివాసం ఉంటున్న క్రషర్ వ్యాపారిని ఆయన భార్య స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ గత నెల 26వ, తేది రాత్రి హత్య చేశారు. అయితే ప్రియుడు రాజేష్‌ను భర్త స్థానంలోకి తీసుకువచ్చింది స్వాతి.
ప్లాస్టిక్ సర్జరీ చేయించడం ద్వారా భర్తకు సుధాకర్ రెడ్డి రూపాన్ని తీసుకురావాలని ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ చివరి అంకంలో బెడిసికొట్టింది. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టడానికి సుధాకర్ రెడ్డి తల్లి, సుధాకర్ రెడ్డి స్నేహితుడి అనుమానాలు కారణమయ్యాయి.

ఐసీయూలోనే చీకట్లోనే రాజేష్ గడిపేవాడు
సుధాకర్ రెడ్డిని హత్య చేసిన తర్వాత రాజేష్‌ను సుధాకర్ రెడ్డిగా కుటుంబసభ్యులను నమ్మించింది స్వాతి. సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి జరిగిందని కుటుంబసభ్యులను నమ్మించింది స్వాతి.అయితే తమ ప్లాన్ బయటపడకూడదనే ఉద్దేశ్యంతో రాజేష్ ఐసీయూలోనే చీకట్లోనే గడిపేందుకు ఇష్టపడేవాడు. ఐసీయూలో లైట్లు వేస్తే ఇబ్బందిపడేవాడని పోలీసులు చెబుతున్నారు.

రాజేష్‌పై తల్లికి కలిగిన అనుమానాలివే
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌పై సుధాకర్ రెడ్డి తల్లి సుమతమ్మకు అనేక అనుమానాలు వచ్చాయి. తొలుత రాజేష్ గొంతును సుమతమ్మ సరిపోల్చుకొంది. ఈ గొంతు తన కొడుకుది కాదని ఆమె అనుమానించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ తీరుపై ఆమెకు తొలుత అక్కడే అనుమానం మొదలైంది. సుధాకర్ రెడ్డి కాలిగోళ్ళు చీలినట్టు ఉంటాయి. కానీ, ఆసుపత్రిలో సుధాకర్ రెడ్డిగా చికిత్స పొందుతున్న రాజేష్ కాలిగోళ్ళు అలా లేవు. మరో వైపు సుధాకర్ రెడ్డి ఛాతీపై వెంట్రుకలు తక్కువగా ఉంటాయి. కానీ, రాజేష్ ఛాతీపై వెంట్రుకలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి గమనించిన సుమతమ్మ మనసులో మధనపడింది.

నర్సులపై కోపంతో ఊగిపోయే రాజేష్
ఐసీయూలో తనకు చికిత్స చేసే సమయంలోనో, ఇతర సమయంలోనో నర్సులు తన వద్ద ఉంటే రాజేష్ కోపంతో ఊగిపోయేవాడు. అసలు తనతో ఎవరు మాట్లాడకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉండేవాడు. తల్లి, సోదరుడితో కూడ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.తనను పరామర్శించేందుకు ఎవరైనా వస్తే కలిసేందుకు ఇష్టపడేవాడు కాదు. వారితో మాట్లాడితే అసలు విషయాలు బయటకు వస్తాయని రాజేష్ జాగ్రత్తపడేవాడు.పరామర్శ కోసం వచ్చిన వారి నుండి తప్పించుకొనేందుకు నిద్రపోతున్నట్టు నటించేవాడు.

నోట్లో గుడ్డలు పెట్టుకొని పెట్రోల్‌తో కాల్చుకొన్నాడు
సుధాకర్ రెడ్డిని చంపిన తర్వాత సుధాకర్ రెడ్డి స్థానంలోకి వచ్చేందుకు రాజేష్, స్వాతిలు యాసిడ్ దాడి నాటకానికి తెరతీశారు.అయితే ముఖంపై క్రీమ్ రాసుకొన్నాడు రాజేష్.తాను ఎక్కడు ముఖంపై క్రీమ్ రాసుకొన్నాడో ఆ ప్రాంతంలోనే పెట్రోల్‌లో ముంచిన వస్త్రంతో ముఖంపై నిప్పంటించుకొన్నాడు. ముఖంపై కాల్చుకొనే సమయంలో అరవకుండా ఉండేందుకుగాను నోట్లో గుడ్డలు పెట్టుకొన్నాడు రాజేష్.క్రీమ్ పెట్టుకోవడంతో ముఖం పెద్దగా కాలలేదు.

సుధాకర్ రెడ్డి స్నేహితుడికి అనుమానం
కొంతకాలంగా తన భార్య స్వాతి తీరుపై సుధాకర్ రెడ్డికి అనుమానం వచ్చింది. అయితే ఈ విషయమై ఓ స్నేహితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా సుధాకర్ రెడ్డి స్వాతిని ప్రశ్నించాడు. దీంతో భార్య, భర్తలు తీవ్రంగా ఘర్షణ పడ్డారు.ఆ సమయంలో స్వాతి సుధాకర్ రెడ్డిని తోస్తే సుధాకర్ రెడ్డి తలకు గాయాలయ్యాయి. అయితే స్వాతి ప్రవర్తనపై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై సుధాకర్ రెడ్డి స్నేహితుడికి అనుమానం వచ్చింది. అయితే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నిర్ధారణకు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆయన కూడ సమయం కోసం ఎదురుచూశాడు. సుధాకర్ రెడ్డి తల్లి మటన్ సూప్ ఇచ్చిన సమయంలో రాజేష్ తాగకపోవడంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో పోలీసులకు సుధాకర్ రెడ్డి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

పిల్లల భాద్యతను తీసుకొన్న స్వాతి తండ్రి
సుధాకర్ రెడ్డి, స్వాతి దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లల బాధ్యతను స్వాతి తండ్రి తీసుకొన్నాడు. సుధాకర్ రెడ్డిని స్వాతి చంపడాన్ని ఆ కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు.తన కూతురు కూడ చనిపోయిందని స్వాతి తండ్రి లింగారెడ్డి చెబుతున్నారు. అయితే సుధాకర్ రెడ్డి, స్వాతి దంపతులకు పుట్టిన పిల్లల బాధ్యతను తీసుకొంటామని చెప్పారు. స్వాతి చేసిన పనితో ఆ కుటుంబం తల ఎత్తుకొనే పరిస్థితి లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications