అసలేం జరిగింది?: నేలపై కూర్చొని శ్రద్ధగా విన్న రాహుల్, ఏకం కండి: డిగ్గీ
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం నాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన వర్సిటీలో పర్యటించి, విద్యార్థులను వివరాలు అడిగారు. రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.
అలాగే, ఫేస్‌బుక్ కామెంట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోహిత్ చిత్రపటానికి, స్మారక స్థూపానికి రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. రోహిత్ తల్లిదండ్రులను రాహుల్ గాంధీ పరామర్శించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాహుల్ గాంధీతో పాటు దిగ్విజయ్ సింగ్, ఇతర కాంగ్రెస్ నేతలు వచ్చారు.
రాహుల్ గాంధీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నేలపై కూర్చొని అన్ని విషయాల పైన ఆరా తీశారు. సస్పెండైన నలుగురు విద్యార్థులతో మాట్లాడేందుకు రాహుల్ గాంధీ నేలపై కూర్చున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రాహుల్ గాంధీతో పాటే నేలపై కూర్చుకున్నారు.

రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అతడి స్నేహితులు చెబుతుంటే, రాహుల్ విన్నారు. అంతేకాక పలు సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు వేసిన రాహుల్ వివరాలన్నీ సేకరించారు. రాహుల్ రాకను స్వాగతిస్తూ ఓ వైపు విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నా, రోహిత్ స్నేహితులు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు.
బహిష్కరణకు గురైన విద్యార్థులతో రాహుల్ సమావేశం
కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైన నలుగురు విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హెచ్‌సియులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ద్విసభ్య కమిటీ ఎదుట విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన రోహిత్ ఆత్మహత్య పైన కేంద్రం ద్విసభ్య కమిటీని వేసింది. ఈ కమిటీ ఎదుట కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సులర్ అప్పారావును తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాలన్నీ ఏకం కావాలి: దిగ్విజయ్
విశ్వవిద్యాలయాల్లో మతతత్వ శక్తులపై పోరాటానికి విద్యార్థి సంఘాలు ఏకం కావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు. విశ్వవిద్యాలయాల్లో వీసీలను ఆరెస్సెస్, బిజెపిలు నియమిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. చదువులకు బదులుగా ఓ విద్యార్థి సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications