జూబ్లీ‌హిల్స్‌‌లో భారీ పేలుడు: కుప్పకూలిన భవనం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: సోమవారం భారీ పేలుడుతో జూబ్లీహిల్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రోడ్‌ నంబర్‌ 48లో ఓ భవన నిర్మాణ స్థలంలో సోమవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఓ బడా పారిశ్రామికవేత్తకు చెందిన ఈ స్థలంలో భవనం నిర్మిస్తున్నారు.

బండరాళ్లను తొలగించేందుకు భారీస్థాయిలో జిలెటిన్‌ స్టిక్స్ వినియోగించారు. దీంతో భారీ శబ్దం చేసుకుంటూ పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో తెలీక స్థానికులు భయంతో పరుగులు తీశారు.

huge blast in Jubilee hills: a old build collapsed

పేలుడు తీవ్రతకు సమీపంలోని ఓ ఇల్లు కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Huge blast occurred in Jubilee hills in Hyderabad on Monday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి