హైదరాబాద్ లో ఇళ్ళు, హాస్టల్స్ కు పెరుగుతున్న డిమాండ్.. ఎందుకో తెలుసా!!
కరోనా మహమ్మారి కారణంగా భాగ్యనగరం వెలవెలబోయింది. ఒకప్పుడు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వారితో కళకళలాడిన హైదరాబాద్ కరోనా మహమ్మారి దెబ్బకు గత రెండు సంవత్సరాలుగా బోసి పోయింది. మళ్లీ ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో భాగ్యనగరం ఉద్యోగులతో సందడి చేయడానికి రెడీ అవుతోంది. దీంతో హైదరాబాద్ లో హాస్టల్స్, ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

కరోనా కారణంగా బోసిపోయిన భాగ్యనగరం .. ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే
కరోనా మహమ్మారి కారణంగా ఇంతకాలం ఐటీ కారిడార్ బోసిపోయింది. ఐటీ సంస్థల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం పని చేయడానికి సంస్థలు నిర్ణయించడంతో పెట్టే బేడా సర్దుకుని సొంత ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో హైదరాబాదు దాదాపు సగం పైగా ఖాళీ అయింది. గత రెండేళ్లుగా హైదరాబాద్ నగరంలో చాలా కాలనీలు టులెట్ బోర్డ్ లతో బోసిపోయి కనిపించాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా ఉద్యోగులు సొంత ఊర్లకే పరిమితం కావడంతో అద్దెలకు ఉండే నాధుడే కరువయ్యారు. ఏ వాడలో చూసినా టూలెట్ బోర్దులే దర్శనం ఇచ్చేవి.

వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ ... సందడిగా మారనున్న హైదరాబాద్
ఇక తాజాగా ఐటీ సంస్థలు ఉద్యోగులను ఆఫీసుకి రావాలని సూచించాయి. ఇక వర్క్ ఫ్రం ఆఫీసు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైటెక్ సిటీ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలు సందడిగా మారుతున్నాయి . కేంద్రం కూడా కోవిడ్ గైడ్ లైన్స్ లో మార్పులు చేయడంతో తిరిగి ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే కంపెనీకి తిరిగి రావాలని ఉద్యోగులకు లేఖలు కూడా పంపించాయి. కొన్ని కంపెనీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరికొన్ని 4వ తేదీ నుండి, మరికొన్ని 11వ తేదీ ల నుండి ఉద్యోగులు ఆఫీసులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాయి.

బాదుడుకు రెడీ అవుతున్న హాస్టల్స్
దీంతో హైదరాబాద్ నగరంలోని అద్దె ఇళ్లకు, హాస్టళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. గత రెండేళ్లుగా ఎలాంటి బిజినెస్ లేకుండా ఇబ్బంది పడిన హాస్టల్ యాజమాన్యాలు, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయనున్న కారణంగా హాస్టల్స్ నిర్వహించటానికి రెడీ అయ్యారు. హాస్టల్స్ లో ఉండాలనుకునే వారికి కూడా ప్రస్తుతం బాగానే ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యావసరాల ధరలు పెరగటంతో పాటు, ఇంతకాలం హాస్టల్స్ కు గిరాకీ లేకపోవటంతో బాదుడుకు రెడీ అవుతున్నారు.
Recommended Video

అపార్ట్ మెంట్ రెంట్ లు కూడా బాగా పెంచేసిన హైదరాబాదీలు
ఇక రెండేళ్లుగా ఖాళీగా ఉన్న పలు అపార్ట్మెంట్లలో రెంట్ లను కూడా బాగా ఎక్కువగా పెంచినట్టుగా సమాచారం. ఏది ఏమైనా ఇంతకాలం వర్క్ ఫ్రమ్ హోం కి అలవాటు పడిన వారు, ఇప్పుడు ఆఫీస్ లకు వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి ఉద్యోగులను కాస్త ఇబ్బందికి గురి చేస్తుంది. ఇంతకాలం సొంత ఊర్లో కుటుంబ సభ్యులతో కలిసి జీవించినవారు, ఇప్పుడు పెరిగిన ఖర్చులతో, అద్దె గదులలో, నగర జీవితాన్ని సాగించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
-
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications