కవితపై పోటీచేసిన కర్షకుల కన్నెర్ర .. రైతులు అనుకున్నది సాధిస్తారా?

నిజామాబాద్ బరిలో కవిత ను డీ కొట్టటానికి రైతులు రెడీ అయ్యారు. నిజామాబాద్ సభలో రైతుల సమస్యలు తీర్చటానికి కృషి చేస్తామని సాక్షాత్తు కేసీఆర్ చెప్పినా ఫలితం లేకపోయింది. కేసీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగిడిన కవిత ఎంపీగా గెలిచి సత్తా చాటుకుంది. ఈ సారి కూడా లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి ఆమె పొటీకి దిగనుంది. కానీ ఆమెకు పొటీగా 200 మంది కి పైగా రైతులు బరిలోకి దిగారు .

మోడీ మీద పోటీ చెయ్యమన్న కవిత .. నువ్వే మోడీ మీద పోటీ చెయ్ అని సలహా ఇచ్చిన రైతులు

మోడీ మీద పోటీ చెయ్యమన్న కవిత .. నువ్వే మోడీ మీద పోటీ చెయ్ అని సలహా ఇచ్చిన రైతులు

మీరు పోటీ చెయ్యాలనుకుంటే మోడీ మీద చెయ్యండి అని కవిత పిలుపునిచ్చినా ఆ పోటీ ఏదో కవితనే మోడీ మీద చెయ్యమని రైతులు సలహా ఇచ్చారు. తమ పరిధిలో చెయ్యగలిగింది తాము చేస్తున్నామని , గిట్టుబాటు ధర సాధించే వరకు దేనికీ వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు .

కేసీఆర్ తనయకే తప్పని తిప్పలు ... నిజామాబాద్ పోరు ఉత్కంఠ

కేసీఆర్ తనయకే తప్పని తిప్పలు ... నిజామాబాద్ పోరు ఉత్కంఠ

లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలను స్వీప్ చేస్తామని ఘంటాపధంగా చెబుతున్న అధికార తెరాస పార్టీ కి పెద్ద ఎత్తున దాఖలైన నామినేషన్లు కలవరం పెడుతున్న విషయం ఇది. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీ కవితపై పోటీ చేసేందుకు వందలమంది రైతులు నామినేషన్లు వెయ్యటం ఆ పార్టీని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. గెలుపు విషయంలో ఆమెకు ఢోకా లేనప్పటికీ ఆమెకు షాకిచ్చేలా నిజామాబాద్ రైతులు కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ తీరును దేశ వ్యాపతంగా ఎండగడుతుంది.

కవితకు ప్రధాన ప్రత్యర్థులు వందల మంది రైతులు

కవితకు ప్రధాన ప్రత్యర్థులు వందల మంది రైతులు

కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ సీటులో పోటీచేయలేక ఆమె ప్రత్యర్ధులు హడలి పోతున్న సమయంలో రైతులు ఇలా పెద్ద సంఖ్యలో పోటికి దిగుతామని నామినేషన్లు వేసి కవితకు షాక్ ఇచ్చారు. మొత్తం 245 మంది బరిలో ఉండటంతో మిగతా పార్టీల కంటే కవిత కే ఇది మరింత ఇబ్బంది కలిగిస్తుంది. రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవ్వటం వల్ల నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ వాడాల్సి ఉంటుంది. దాని ఫలితం ఎన్నిక వాయిదా పడే అవకాశాలు లేక పోలేదు.

కవిత మెజార్టీ గోల్ మాల్ అవుతుందా ? అసలేం జరుగుతుందో

కవిత మెజార్టీ గోల్ మాల్ అవుతుందా ? అసలేం జరుగుతుందో

వీరంతా అనుకున్నట్టే పోటీలో నిలిస్తే ఓట్లు చీలడం తథ్యం. అసలే మెజారిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు కేసీఆర్. ఎంత ఎక్కువ మెజారిటీ వస్తే అంత బలం అని ఆయన అభిప్రాయం. మరి ఆ మెజారిటీకి గండి కొట్టేలా రైతులు తీసుకున్న ఈ డెసిషన్ పట్ల కవిత కానీ కేసీఆర్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి రైతులు కవిత కు భారీ షాక్ ఇచ్చారు. కవితకు టెన్షన్ పుట్టించారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+