వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుప్పుల వేట: నలుగురు నిందితుల కస్టడీ కోరనున్న అటవీశాఖ...?

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట అటవీ ప్రాంతంలో జరిగిన దుప్పులవేట, తుపాకీతో అటవీ శాఖ అధికారులను బెదిరించిన సంఘటనలో నలుగురు నిందితులను విచారించేందుకు అటవీశాఖ న్యాయస్థానం అనుమతి కోరనుంది.

దుప్పుల వేటకు సంబంధించి లొంగిపోయిన నలువాల సత్యనారాయణ, ఖాలీముల్లాఖాన్‌, అస్సర్‌ అహ్మద్‌ఖురేషీలను న్యాయస్థానం అనుమతి కోరి సమగ్రంగా విచారించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మిగతా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా వారిని రిమాండ్‌కు తరలించారు.

ఈ క్రమంలో అటవీశాఖ తరుపున న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి విచారణకు అనుమతి ఇవ్వాలని సోమవారం కోరనున్నట్లు సమాచారం. నెన్నల గట్టయ్య, అక్భర్‌ఖాన్‌, మున్నా, ఫైజల్‌ మహ్మాద్‌ఖాన్‌ విచారణకు అనుమతి కోరనున్నట్లు తెలిసింది.

Hunting: forest department likely to take four accused in to their custody

ఆర్టీసీ మెకానిక్‌ ఛార్జిమెన్‌ మృతి
డీఎం వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

నర్సంపేట: నర్సంపేట ఆర్టీసీ డిపోలో మెకానిక్‌ ఛార్జిమెన్‌(ఎంసీ)గా పని చేస్తున్న కార్మికుడు శనివారం మృతి చెందాడు. తమ బిడ్డ మృతికి డీఎం వేధింపులే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్థానిక డిపో ప్రధాన ద్వారం వద్ద అడ్డంగా పెట్టి ఆందోళన నిర్వహించారు. దీంతో స్థానిక డిపోలో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మృతుడి భార్య నాగమణి, కూతుళ్లు కృష్ణవేణి, మాధవి, ఆర్టీసీ కార్మికులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లంద మండలానికి చెందిన కుంజ నర్సింహారావు(కేఎన్‌రావు)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేసే వారు.

ఆయనకు ఎంసీగా పదోన్నతి కల్పిస్తూ నర్సంపేట ఆర్టీసీ డిపోకు బదిలీ చేశారు. గత నెల 18న ఇక్కడ ఎంసీగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి రోజు ఇంటి నుంచి వచ్చి పోతూ విధులను నిర్వహిస్తున్నారు. గత గురువారం రాజగోపాల్‌ అనే కార్మికుడు సంబంధిత ఉద్యోగికి సమాచారమందించి విధులకు గైర్హాజరవగా, పై అధికారి ఆదేశాల మేరకు ఆయనకు కేఎన్‌రావు హాజరుపట్టికలో లీవ్‌గా నమోదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న స్థానిక డీఎం మధుసూదన్‌ నీవు అతడికెలా లీవు వేశావంటూ, మెమో ఇస్తానని బెదిరించారు. ఇక్కడే ఉండి విధులు నిర్వర్తించాలని ఇంటి నుంచి వచ్చి పోతే ఛార్జీ మెమో ఇస్తానంటూ అనేక విధాలుగా వేధింపులకు గురి చేశారు.

ఈ వేధింపుల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఇంటినుంచి విధులకు బయలుదేరి వెళ్లాడని అతని భార్య నాగమణి, కూతుళ్లు కృష్ణవేణి, మాధవి తెలిపారు. శనివారం రాత్రి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది తనకు ఫోన్‌ చేసి తమ తండ్రి కెఎన్‌రావు మృతిచెందాడని చెప్పారని చిన్న కూతురు మాధవి తెలిపింది.

ఎంజీఎం నుంచి ఫోన్‌ వచ్చే వరకు తమకు ఆర్టీసీ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదని తన భర్త విధుల్లోనే ఉన్నాడని భావించామని మృతుడి భార్య, కూతుళ్లు తెలిపారు. కార్మికుడి రెండు రోజులుగా విధుల్లోకి రాకుంటే ఏమయ్యాడని కనీసం సమాచారం తెలుసుకోకుండా నిర్లక్ష్యం వహించడం ఎంత వరకు సబబు అని వారు ప్రశ్నించారు. ఇక్కడ విధుల్లో చేరిన నాటి నుంచి డీఎం వేధింపులకు గురి చేస్తున్నాడని చెబుతూ బాధ పడేవాడని అనవసరంగా పదోన్నతిపై వెళ్లాను భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

English summary
It said that the forest department likely to take four accused in to their custody in hunting case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X