Hurun India Rich List 2026: హైదరాబాద్ లో టాప్ 7 రిచెస్ట్ పర్సన్స్ వీళ్లే..

హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది. భాగ్యనగరం ఇండస్ట్రియల్, రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్ వేర్, బయో టెక్నాలజీ తో పాటు అనేక రంగాల్లో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ప్రతిష్టాత్మక హురున్ లిస్ట్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టాప్ 100 బిలియనీర్ల లిస్టులో హైదరాబాద్ నుంచి ఏడుగురు చోటు సంపాదించారు. వీరి మొత్తం సంపద విలువ రూ. 4,01,200 కోట్లు ఉంది. ఈ లిస్టులో ఫార్మాసుటికల్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, డేటా సెంటర్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు ఉన్నారు. వీరిలో హురున్ 100 లిస్టులో టాప్ 3 గా మురళి దివి అండ్ ఫ్యామిలీ, పి. పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి ఉన్నారు. మురళి దివి అండ్ ఫ్యామిలీ ఆస్తుల విలువ రూ. 1,25,400 కోట్లుగా ఉంది. దివిస్ లాబోరేటరీ మురళి దివి అండ్ ఫ్యామిలీకు చెందినదే..

ఇక పి. పిచ్చిరెడ్డి సంపద విలువ రూ. 53,100 కోట్లుగా ఉంది. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లో పిచ్చిరెడ్డి భాగస్వామిగా ఉన్నారు. అలాగే మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ నుంచి పీవీ కృష్ణారెడ్డి రూ. 52,100 కోట్ల సంపదలో మూడో స్థానంలో నిలిచారు. శ్రీధర్ పిన్నపురెడ్డి అతని కుటుంబం సంపద విలువ రూ. 46,100 కోట్లుగా ఉంది. ఈ కుటుంబం సీటీఆర్ఎల్ ఎస్ డేటా సెంటర్స్ తో అసోసియేట్ అయి ఉంది. పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 39,900 కోట్లుగా ఉంది. ఈయన అరబిందో ఫార్మాతో అసోసియేట్ అయ్యారు. బీ పార్థసారథి రెడ్డి అండ్ ఫ్యామిలీ ఆస్తుల విలువ రూ. 39,400 కోట్లుగా ఉంది. ఈ ఫ్యామిలీ హెటెరో ల్యాబ్ తో అసోసియేట్ అయి ఉంది.

hurun Seven Hyderabad billionaires feature in the Hurun India Top 100 list here are the details

అలాగే సురేందర్ పాల్ సింగ్ సలుజా అండ్ ఫ్యామిలీ ఆస్తుల విలువ రూ. 35,200 కోట్లుగా ఉంది. వాళ్లు ప్రీమియర్ ఎనర్జీస్ తో అసోసియేట్ అయి ఉన్నారు. వీళ్లందరి సంపద విలువ మొత్తం రూ. 4,01,200 కోట్లుగా ఉంది. హురున్ టాప్ 100 లిస్టులో హైదరాబాద్ లోని ఈ ఏడుగురు రిచెస్ట్ వ్యక్తులు చోటు సంపాదించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+