జీతం డబ్బుల కోసం భార్యాభర్తల పంచాయితీ: షాకింగ్ నిర్ణయం తీసుకున్న భర్త!!
చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు గొడవ పడటం ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది. చిన్న చిన్న మనస్పర్థలకే భార్యాభర్తలు విడిపోతున్న సందర్భాలు కూడా అనేకం చోటుచేసుకుంటున్నాయి. కేవలం జీతం డబ్బుల కోసం భార్య భర్తలు గొడవ పడి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేసుకున్న ఘటన, ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

జీతం డబ్బుల కోసం గొడవ.. భర్తను వదిలేసి వెళ్ళిన భార్య
వివరాల్లోకి వెళితే ఆనంద్ బాగ్ కు చెందిన మోర సంతోష్ కుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతను నేరేడ్మెట్ కాకతీయ నగర్ కు చెందిన శ్రీలత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. శ్రీలత ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తుంది. గత నెల 27వ తేదీన శ్రీలతకు వచ్చే జీతం విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. దీంతో శ్రీలత భర్తను వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. సంతోష్ అదే రోజు శ్రీలత వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ కూడా భార్యతో గొడవ పడ్డాడు.

భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
దీంతో సంతోష్ పై శ్రీలత నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ శ్రీలత భర్తపై ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే దసరా పండుగ సందర్భంగా సంతోష్ తన ఇంట్లో కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడిపాడు. కానీ భార్య తనను వదిలి వెళ్లిపోయిందని, కేవలం జీతం డబ్బుల కోసం తనతో పంచాయితీ పెట్టుకుందని, తనపై పోలీసు కేసు కూడా పెట్టిందని తీవ్ర ఆవేదనతో ఉన్న సంతోష్ రాత్రి అందరూ నిద్ర పోయిన తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

మనస్తాపంతో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న భర్త
తన బెడ్రూమ్ లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి సంతోష్ ఉరేసుకుని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు భార్య వల్లే సంతోష్ ఉరివేసుకున్నాడు అని ఆరోపిస్తున్నారు. సంతోష్ కుమార్ తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆందోళనకరంగా భార్యాభర్తల పంచాయితీలు
భార్యాభర్తల బంధం అంటే ఒకరిని ఒకరు అర్ధం చేసుకునేది.. ఒకరి కోసం ఒకరు సర్దుకునేది. కానీ ఇటీవల కాలంలో ఎవరూ ఎవరినీ అర్ధం చేసుకునే పరిస్థితి లేదు. ఇక సర్దుకునే పరిస్థితి అంతకన్నా కనిపించటం లేదు. ఫలితంగా భార్యాభర్తల మధ్య పంచాయితీలు పోలీస్ స్టేషన్ లకు చేరుతున్నాయి. ఇక గొడవలు మరింత పెరిగి ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఈ పరిస్థితులు అత్యంత ప్రమాదం అని చెప్తున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications