పెళ్లైనా ప్రియుడితోనే ప్రేమాయణం: వీడియో తీసి పోలీసులకు పట్టించిన భర్త
హైదరాబాద్: ఇష్టం లేని పెళ్లి చేశారని పెళ్లైన తర్వాత భర్తతో కాపురానికి వెళ్లలేదు. దీంతో తనతో కలిసి ఉండాలని, కాపురానికి రావాలని భర్తతో సహా అత్తింటివారు అడగడంతో తనను వేధిస్తున్నారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త కుటుంబం మానసికంగా కుంగిపోయింది.
ఇదిలా ఉండగా తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని బంధువులు, స్నేహితుల ద్వారా తెలుసుకున్న భర్త ఆమెపై నిఘా పెట్టాడు. ప్రియుడితో కలిసి ఇంట్లో ప్రేమాయణం నడుపుతుండగా ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ యువతితో సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి 2009లో వివాహం అయింది. పెళ్లికి ముందు ఎంబీఏ చదువుతున్న రోజుల్లో ఆమె తన కాలేజీ స్నేహితుడు అయిన విజయశేఖర్‌రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది.

అయితే చదువు పూర్తైన తర్వాత యువతి తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేశారని అత్తారింటికి వెళ్లలేదు. భర్తతో కాపురం చేయకుండా పుట్టింట్లోనే ఉంటోంది. కాపురానికి రావాలని భర్త, అత్తమామలు కోరినా అందుకు నిరాకరించింది. భర్త, అత్తమామలపై 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో వారిపై 498ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆమె ప్రియుడితో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లడం గమనించిన బంధువులు యువతి భర్తకు సమాచారమిచ్చారు. భార్యపై నిఘా పెట్టిన భర్త శనివారం రాత్రి నారాయణగూడ వైఎంసీఏ సమీపంలో ఉన్న విజయశేఖర్‌రెడ్డి ఇంట్లో ఆమె ఉండగా పట్టుకున్నాడు.
వారిద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలను చిత్రీకరించి నారాయణగూడ పోలీసులకు అప్పగించాడు. దీంతో ప్రియుడిపై మోజుతోనే తనపై వేధింపుల కేసు పెట్టిందని పోలీసులకు చెప్పాడు. కాగా, విజయశేఖర్‌రెడ్డిపై 497 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉంటే యువతిపై కేసు నమోదు చేయకుండా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సీఐ భీంరెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications