బెడ్‌రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్: పోర్న్ సైట్‌లో పెడుతానని భర్త వేధింపులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ భర్త.. అదనపు కట్నం కోసం దిగజారుడు చర్యలకు పాల్పడ్డాడు. పెళ్లయిన ఏడాదికే ఉద్యోగం మానేసి అత్తారింట్లో తిష్టవేసిన అతగాడు.. అత్తింటివారికి తెలియకుండా, సీక్రెట్ కెమెరాలతో భార్య సోదరితో పాటు అత్తమామల బెడ్ రూమ్ దృశ్యాలను చిత్రీకరించాడు. ఆపై అదనపు కట్నం కోసం ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

పోలీసుల కథనం ప్రకారం.. సీహెచ్ ప్రవీణ్ అనే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ యువతితో 2016 ఫిబ్రవరి 28న ఘనంగా వివాహం జరిగింది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పడంతో.. కూతురి భవిష్యత్తు బాగుంటుందని, యువతి తల్లిదండ్రులు ఈ వివాహం నిశ్చయం చేశారు.

husband harrased wife for dowry and blackmailed with private videos

కానీ పెళ్లయిన ఏడాదికే ప్రవీణ్ అసలు బాగోతం బట్టబయలైంది. ఏడాది తర్వాత విదేశాల నుంచి వచ్చి అత్తారింట్లోనే తిష్ట వేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా.. అత్త మరియు భార్య సోదరి గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి ఏకాంత క్షణాలను చిత్రీకరించాడు. విషయం తెలియడంతో.. అత్తింటివాళ్లు అతన్ని దూరం పెట్టారు. దీంతో సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాలను భార్య మొబైల్ ఫోన్ కు పంపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

తను కోరినట్లుగా డబ్బు ఇవ్వని పక్షంలో.. ఆ వీడియోలను పోర్న్ సైట్లకు విక్రయించడంతో పాటు, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువవుతుండటంతో బాధిత కుటుంబం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A husband blakmailed his wife and Mother-in-law with their private videos for Extra dowry. He recorded his mother-in-law bedroom videos secretly
Please Wait while comments are loading...