భార్యపై అనుమానం: పిల్లల్ని చంపేసి, తగులబెట్టుకున్న భర్త

వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య పైన అనుమానంతో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపేసి, ఆ తర్వాత తనను తాను తగులబెట్టుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం పాములూరులో జరిగింది.

చనిపోయిన వ్యక్తి పేరు శ్రీనివాస్. అతని పిల్లలు రసజ్ఞ (8), అక్షిత (5). వారిని కూడా అతను చంపేశాడు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Husband kills children and commits suicide

విద్యుత్‌షాక్‌తో ఇద్దరు చిన్నారులు మృతి

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పెళ్లిపాకలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు చిన్నారులు అశ్విని(5), కార్తీక్(3) మృతి చెందారు. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లిపాకలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం బోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+