హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానం: భార్యని చంపి అడవుల్లో పాతిన కానిస్టేబుల్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ భార్యను కాల్చి చంపాడు. ఈ సంఘటన హైదరాబాదులో ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 6వ తేదీన కానిస్టేబుల్ రామకృష్ణ తన భార్య సుప్రియను చంపాడు.

అనంతరం తన మిత్రుడి సహకారంతో రంగారెడ్డి అడవుల్లో పూడ్చి పెట్టాడు. అనంతరం అదృశ్యం అంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానంతో రామకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా, విషయం వెలుగు చూసింది.

Husband kills wife’s lover

అదుపులోకి తీసుకున్నాం: పోలీసులు

భార్యను చంపిన కేసులో భర్త రామకృష్ణను అదుపులోకి తీసుకున్నామని సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి చెప్పారు. భార్య మృతదేహాన్ని సూటుకేసులో పెట్టి బైక్ పైన వికారాబాద్ తీసుకెళ్లాడని చెప్పారు. మృతదేహాన్ని
కాల్చి పూడ్చి పెట్టాడన్నారు.

రామకృష్ణకు సహకరించిన స్నేహితుడు ప్రదీప్ కోసం గాలిస్తున్నామన్నారు. భార్య పైన అనుమానంతో హత్య చేసినట్లుగా రామకృష్ణ చెప్పాడన్నారు. మిత్రుడి సహాయంతో చంపినట్లు అంగీకరించాడని చెప్పారు. ఆ తర్వాత భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడని చెప్పారు.

Husband kills wife’s lover

భార్యతో అక్రమ సంబంధం, హత్య

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిని నరికి చంపిన అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన కూకట్‌‌పల్లి పరిధిలో జరిగింది. డోర్‌మేట్స్ చాపలు తయారు చేసే సుబ్బారావు వద్ద ఇదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ పని చేస్తున్నాడు.

ఈ నెల 7వ తేదీ నుంచి రాజశేఖర్ కనిపించడం లేదు. బుధవారం ఉదయం అతని సోదరుడు వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు. రెండు గంటల తర్వాత సుబ్బారావు పోలీసు స్టడేషన్‌కు వచ్చి రాజశేఖర్‌ను నేనే చంపానని లొంగిపోయాడు.

Husband kills wife’s lover

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో 7వ తేదీన రాజశేఖర్‌కు మద్యం తాగించి సున్నం చెరువు వద్దకు తీసుకు వెళ్లానని వివరించాడు. అక్కడే తలపై కత్తితో నరికి చంపానని చెప్పాడు. శవాన్నిసంచిలో కట్టి చెరువులే పడేసినట్లు చెప్పాడు. ఈ హత్యకుకారణం ఇదేనా ఇంకేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

విశాఖ - నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

విశాఖ - నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్లో గురువారం ఉదయం ఖమ్మం జిల్లా బోనకల్లు సమీపంలో రామాపురం - నాగులవంచ మధ్య దోపిడీ జరిగింది.

7,8,9 బోగీల్లో నిద్రిస్తున్న వారి నుంచి దుండగులు బంగారు నగలు అపహరించారు. బాధితులు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. 12 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉద్యోగాల పేరిట మోసం: నిందితుడి అరెస్టు

ప్రైవేటు సంస్థల్లో చిన్నపాటి ఉద్యోగాలు ఉన్నాయని అందుకు వెంటనే దరఖాస్తు చేసుకోండి అని వివిధ దిన పత్రికల్లో తప్పుడు ప్రకటనలిచ్చి అమాయక యువతను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని హైదరాబాద్ సిసిఎస్, మర్కెటింగ్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎస్సార్ నగర్లో నివాసం ఉంటున్న రంగానాథ్ ఎల్‌విఆర్ సోల్యూషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ డాటా ఎంట్రీకి సంబంధించిన ఉద్యోగ ఆవకాశాలున్నాయని వివిధ దిన పత్రికల్లో తప్పుడు ప్రకటనలిచ్చాడు.

ఈ క్రమంలో అమాయక నిరుద్యోగులైన యువకులు కొంతమంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని ముందుగానే 3 వేల రూపాయలను వసూలు చేసేవాడు. మోసపోయిన బాదితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దాడి చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

ఎసిపి సైబర్ క్రైమ్ డాక్టర్ బి.అనురాధ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ జి.శంకర్ బృందం దాడి చేసి నిందితుడు రంగన్నను అరెస్ట్ చేసి, అతని నుండి 30వేల నగదు, సామ్‌సంగ్ హార్డ్‌డిస్క్, సామ్‌సంగ్ మోబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

English summary
A 30 year old man was stabbed to death by his friend for allegedly having a sexual relationship with the killer’s wife. The murder occurred two days ago. However, the body was found on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X