పెళ్లయి 11 నెలలే: భార్య వేధింపులకు భర్త ఆత్మహత్య? (ఫోటోలు)

హైదరాబాద్: భార్య వేధింపులకు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. హైదరాబాదులోని పాతబస్తీ మొగల్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. భార్య, అత్తల ముందే అతను విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు.

మొగల్‌పురా హుస్సేన్ కోటకు చెందిన హష్మీ హుస్సేన్ రజ్వీ (28) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి 11 నెలల క్రితం కాలిఖబర్‌కు చెందిన హాఫ్‌సా ఉన్నిసాతో 11 నెలల క్రితం పెళ్లయింది. తొలుత వీరి కాపురం సజావుగానే సాగినా తర్వాత కలహాలు ప్రారంభమయ్యాయి.

దాంతో ఈ మధ్య వారిద్దరిని దక్షిణ మండలం డిసిపి ఇటీవల కౌన్సెలింగ్‌కు పంపించారు. భర్తపై అలిగిన ఉన్నిసా కొద్ది రోజులుగా భర్త నుంచి విడిపోయి కాలిఖబర్‌లోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. భార్య వేధింపుల వల్లే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని అతని సోదరుడు ఆరోపిస్తున్నాడు.

ఇంటికి వచ్చింది...

ఇంటికి వచ్చింది...

ఆదివారం మొగల్‌పురాలోని భర్త నివసించే ఇంటికి ఉన్నిసా వచ్చి ఇంట్లోని సామగ్రిని తీసుకుని వెళ్తానని చెప్పింది. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

పోలీసులకు సమాచారం...

పోలీసులకు సమాచారం...

భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్న విషయాన్ని ఉన్నిసా కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేసింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు..

కుటుంబ సభ్యుల ఫిర్యాదు..

కుటుంబ సభ్యులు రజ్వీ మృతిపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

బెదిరించారు....

బెదిరించారు....

రజ్వీని భార్య, అత్త నిత్యం వేధించారని, కేసులు పెడుతామని బెదిరిస్తూ వచ్చారని, దీంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు ఫిర్యాదు చేశాడు.

భార్యపై కేసు..

భార్యపై కేసు..

సోదరుడి పిర్యాదుతో మృతుడు రజ్వీ బార్య అఫ్సానున్నీసాపై పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రజ్వీ బంధువులు, మిత్రులు డిసిపిని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+