Huzurabad : రేపో.. మాపో... హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్.. ప్రధాన పార్టీలకు సంకేతాలు...?
హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఇక రేపో మాపో వస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. శుక్రవారం(అగస్టు 6) లేదా శనివారం(అగస్టు 7) షెడ్యూల్ రావొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు సంకేతాలు అందినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో పర్యటించడం... ఆ మరుసటిరోజే దళిత బంధు చెక్కుల పంపిణీ చేపట్టడం చకచకా జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.

ఉంటుందో ఉండదో అన్న అనుమానాలు...
నిజానికి కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పట్లో ఉపఎన్నిక నిర్వహించడంపై అనుమానాలు నెలకొన్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో ఆ ఎన్నికలు నిర్వహించడం వీలు పడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరోవైపు బెంగాల్‌లో దీదీపై కక్ష సాధించేందుకు భవానీపూర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కేంద్రమే ఎన్నికల సంఘాన్ని నియంత్రిస్తోందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో జరుగుతుందా జరగదా అన్న అనుమానాలు నెలకొన్నాయి.

అంతకన్నా ముందే అభ్యర్థి ప్రకటన...
కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందడంతో... శుక్ర,శనివారాల్లో షెడ్యూల్ రావడం ఖాయమేనన్న ప్రచారం జరుగుతోంది. ఉపఎన్నిక షెడ్యూల్ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ త్వరలోనే తమ అభ్యర్థిని ప్రకటించవచ్చు. ఈ నెల 16వ తేదీన హుజురాబాద్ పర్యటన సందర్భంగా కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. అయితే షెడ్యూల్ రాక నేపథ్యంలో అంతకన్నా ముందే అభ్యర్థిని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికైతే టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇప్పటికే ఆయన పేరును దాదాపుగా ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది.

Recommended Video

నేడే ఈటల డిశ్చార్జి.. నేరుగా హుజురాబాద్‌కు
పాదయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత ఈటల రాజేందర్ గురువారం(అగస్టు 5) డిశ్చార్జి కానున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్దే ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మోకాలి సర్జరీ నేపథ్యంలో పాదయాత్ర కొనసాగింపుపై అనుమానాలు నెలకొనగా... ఈటల రాజేందర్ దానిపై స్పందించే అవకాశం ఉంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా హుజురాబాద్ వెళ్తారు. నిజానికి నెల రోజుల వరకు ఆయన బెడ్ రెస్ట్‌లో ఉంటారన్న వార్తలు వచ్చినప్పటికీ... ఉపఎన్నిక షెడ్యూల్ సంకేతాలు అందడం వల్లే... ఆరోగ్యం కుదుటపడకపోయినా మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది.హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో స్తబ్దుగా ఉంటున్న కాంగ్రెస్ సైతం బుధవారం(అగస్టు 4) సమావేశమై చర్చించింది. ఉపఎన్నిక షెడ్యూల్ సంకేతాలు అందడమే దీనికి కారణమనే వాదన వినిపిస్తోంది.

Click it and Unblock the Notifications