ఈటలకు అస్వస్థత: hyderabad తరలింపు -నిమ్స్‌లో చేరిక -huzurabadలో పాదయాత్రకు బ్రేక్ -రంగంలోకి జమున!

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం సమయానికి బాగా నిరసించిపోయినను హుటాహుటిన హైదరాబాద్ తరలించి, నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన చేస్తోన్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వివరాలివి..

ఉప ఎన్నిక నేపథ్యంలో 'ప్రజా దీవెన యాత్ర' పేరిట హుజురాబాద్‌ నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్ర చేస్తోన్న ఈటల రాజేందర్ అలుపు లేకుండా నడుస్తుండటంతో ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన జ్వరం, కాళ్లనొప్పులతో బాధపడుతోన్న ఈటలను వైద్యులు పరీక్షించి హైదరాబాద్ కు రిఫర్ చేశారు. దీంతో పాదయాత్రకు బ్రేకిచ్చి, ఆయన హైదరాబాద్ నిమ్స్ లో చేరారు..

huzurabad by poll: Etela Rajender suffers high fever, admitted to hyderabad nims

పాదయాత్ర కారణంగా ఈటలకు బీపీ 90/60కి పడిపోయిందని, షుగర్‌ లెవెల్స్‌ పెరిగాయని, ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోయాయని అందుకే హైదరాబాద్ ఆస్పత్రిలో చేరాల్సిందిగా వైద్యులు రిఫర్ చేసినట్లు బీజేపీ నేతలు చెప్పారు. ఎండావానకు తడుస్తూ కొనసాగిస్తుండడంతో ఈటల నీరసించిపోయారని ఆయన అనుచరులు చెప్పారు.

పాదయాత్రలో భాగంగా శనివారం వీణవంక మండలం కొండపాక గ్రామంలో పర్యటించిన ఈటల.. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పూర్తిగా నీరసించారని, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తరలించామని అనుచరులు తెలిపారు. కాగా, ఈటల జ్వరం బారిన పడడంతో ఆయన బదులు ఈటల సతీమణి జమున పాదయాత్ర కొనసాగిస్తారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+