వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Huzurabad by-poll: ఎన్నికల ప్రచారంలో ఈటల జమునకు షాక్; టీఆర్ఎస్ కుట్రేనన్న బీజేపీ!!

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి షాక్ ఇవ్వడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందా? టిఆర్ఎస్ పార్టీ నేతలు పెరిగిన నిత్యావసర ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా వినియోగిస్తున్నారా? అడుగడుగునా బీజేపీ నేతలకు ఎన్నికల ప్రచారంలో గ్యాస్ బండ గుదిబండగా మారుతుందా? టీఆర్ఎస్ పార్టీ నేతలు అడుగడుగునా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారా? అంటే బీజేపీ శ్రేణుల నుండి అవుననే సమాధానమే వస్తోంది.

 పెరిగిన ధరలను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

పెరిగిన ధరలను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని దూకుడుగా నిర్వహిస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా బీజేపీ ని టార్గెట్ చేస్తూ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను ప్రస్తావిస్తుంది. బీజేపీకి ఓటేస్తే పెరిగిన ధరలకు మద్దతు ఇచ్చినట్లేనని టిఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా హుజరాబాద్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు బిజెపికి షాక్ ఇస్తున్నారు.

 ఎన్నికల ప్రచారంలో ఈటల జమునకు నిరసన సెగ

ఎన్నికల ప్రచారంలో ఈటల జమునకు నిరసన సెగ

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్ కోసం ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్న ఈటల సతీమణి జమునకు హుజురాబాద్ టౌన్ లోని ప్రజలు ఝలక్ ఇచ్చారు. ఈటల రాజేందర్ సతీమణి జమున హుజురాబాద్ నియోజకవర్గంలోని తెలుగువాడ, పోచమ్మ కాలనీ, కింది వాడ, రజక వాడలో ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు వంటగ్యాస్ ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ల ఇంటి ముందు గ్యాస్ సిలిండర్లను పెట్టి నిరసన వ్యక్తం చేశారు.

 వంట గ్యాస్ ధరలను తగ్గించాక ఓట్లు అడగాలని నిలదీసిన ఓటర్లు

వంట గ్యాస్ ధరలను తగ్గించాక ఓట్లు అడగాలని నిలదీసిన ఓటర్లు

వంట గ్యాస్ ధరను తగ్గించిన తర్వాత ఓట్లు అడగాలని మహిళలు ఇళ్ల ఎదుట ఖాళీ సిలిండర్లను ప్రదర్శించారు. రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు జమున దృష్టికి తీసుకువెళ్లారు. వంటగ్యాస్ ధరల పై సమాధానం చెప్పలేక పోయిన జమున అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే దీనిపై బీజేపీ నేతలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని టిఆర్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులతో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఎన్నికల ప్రచారం అడ్డుకునే కుట్రలో భాగం అంటున్న బీజేపీ నేతలు

ఎన్నికల ప్రచారం అడ్డుకునే కుట్రలో భాగం అంటున్న బీజేపీ నేతలు

బీజేపీ నేతల ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం కోసం కుట్రలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తుందని, కావాలని ఎన్నికల ప్రచారానికి అడుగడుగున అవాంతరాలు కల్పిస్తుందని బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ గెలుస్తాడనే భయంతోనే ఈ తరహా చర్యలకు దిగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీ నేతలను అడ్డుకోవాలంటూ టీఆర్ఎస్ ప్రచారం

బీజేపీ నేతలను అడ్డుకోవాలంటూ టీఆర్ఎస్ ప్రచారం

ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ప్రజల్లో పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలను, పెట్రోల్ డీజిల్ ధరలను, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన తర్వాతే బీజేపీ నేతలు ఓట్లు అడగడానికి రావాలని, అప్పటివరకూ ఓట్లు అడగడానికి బీజేపీ నేతలు ఎవరు వచ్చినా వారిని ప్రజలు అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు. మొత్తానికి హుజరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో పాటు ఎన్నికల ప్రచార వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

English summary
Huzurabad by-poll election campaign reaches peaks. voters protest with gas cylinders gave Shock to Etela Jamuna in election campaign. BJP leaders slams this is TRS conspiracy to resist bjp campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X