Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హుజురాబాద్ లో డ్రోన్లతో నిఘా.. ఆ సర్టిఫికెట్ ఉంటేనే నామినేషన్, ఈటల,బలమూర్ నామినేషన్ అప్పుడే!!

హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామా చేసిన అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ రావడంతో నామినేషన్లు దాఖలు చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు వస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికను తమ నిరసన తెలియజేయడానికి ఒక వేదికగా మార్చుకోవాలని పలువురు భావించారు.ఈ క్రమంలోనే నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ రీతుల్లో ప్రభుత్వంచే బాధించబడిన వారు హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లను దాఖలు చేయాలని హుజురాబాద్ కు వెళుతున్నారు. అయితే కఠిన నిబంధనలతో నామినేషన్ దాఖలు చేయడం వారికి ప్రతిబంధకంగా మారుతోంది. ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికల పోరును అధికారులు డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నారు.

కరోనా వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ సర్టిఫికెట్ తీసుకున్నవారే నామినేషన్ కు అర్హులు
కరోనా మహమ్మారి సమయంలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో కరోనా వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ సర్టిఫికెట్ తీసుకున్నవారు మాత్రమే నామినేషన్ వేయడానికి రావాలని షెడ్యూల్ విడుదలైన సమయంలోనే అధికారులు తెలియజేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, అందరూ సెకండ్ డోస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని,కరోనా నిబంధనలు పాటించాలని మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు పేర్కొన్నారు. అయితే నామినేషన్లు దాఖలు చేయడానికి వస్తున్న చాలా మంది అభ్యర్థులు కరోనా నిబంధనలను పాటించకుండా, పూర్తిగా వ్యాక్సినేషన్ కూడా తీసుకోకుండా ,భారీగా అనుచరులతో వస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

Huzurabad by-poll: Surveillance with drones, vaccination second dose certificate must for nomination

నామినేషన్ దాఖలుకు రూల్స్ పాటించని వారిని వెనక్కు పంపుతున్న అధికారులు
ఈ క్రమంలో అధికారులు కరోనా నిబంధనలు పాటించని వారిని వెనక్కి పంపుతున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి అనుమతి నిరాకరిస్తున్నారు. మరి కొందరి నామినేషన్లను నామినేషన్ పత్రాలలో లోపాలు ఉన్న కారణంగా తిరస్కరిస్తున్నారు. అయితే ఎన్నికల అధికారులు కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారని నామినేషన్లు దాఖలు చెయ్యటానికి వస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సమయంలో, ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు దృష్టి సారించారు.

హుజురాబాద్ లో డ్రోన్స్ తో నిఘా, అడుగడుగునా తనిఖీలు
ప్రస్తుతం హుజురాబాద్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా పోలీస్ అధికారులు నిఘా, తనిఖీలను ముమ్మరం చేశారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్న ఆర్డీవో కార్యాలయంతో పాటుగా, నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలలో డ్రోన్లను రంగంలోకి దించారు. శాంతిభద్రతలతోపాటుగా రాజకీయ పార్టీ నాయకుల సమావేశాలపై, కరోనా నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నదానిపై దృష్టి పెట్టడం కోసమే డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు హుజురాబాద్ కు వెళ్లే అన్ని రహదారులపై పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. హన్మకొండ, కరీంనగర్ ల మీదుగా వస్తున్న వాహనాలను నిత్యం తనిఖీ చేస్తున్నారు.

Huzurabad by-poll: Surveillance with drones, vaccination second dose certificate must for nomination

టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు తొలిరోజే నామినేషన్, అక్టోబర్ 8 న ఈటల, వెంకట్ నామినేషన్
ఈ నెల 1వ తేదీన నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. 8వ తేదీన ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. సోమవారం ఈటల రాజేందర్ సతీమణి జమున నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ సారి ఎన్నికల బరిలో పెద్ద సంఖ్యలోనే దిగాలని ప్రయత్నిస్తున్నారు.మరోపక్క హుజరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇక చాపకింద నీరులా ప్రలోభాల పర్వం కూడా కొనసాగుతుందని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+