వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Huzurabad by-poll: ఈటల రాజీనామా ప్రజల కోసం చేశారా? ఓటెందుకు వెయ్యాలి? వినోద్ కుమార్ సూటి ప్రశ్న

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్, బిజెపి నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మీకు ఎందుకు ఓటేయాలి అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రత్యర్థి పార్టీల బలహీనతలను ఏకరువు పెడుతున్నారు. తాజాగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ కి ఎందుకు ఓటు వెయ్యాలో చెప్పాలని ప్రశ్నించారు.

ఓటుతో దెబ్బ కొడితే ప్రగతి భవన్ లో కేసీఆర్ చెంప చెళ్ళుమనాలి : హుజురాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ విజ్ఞప్తిఓటుతో దెబ్బ కొడితే ప్రగతి భవన్ లో కేసీఆర్ చెంప చెళ్ళుమనాలి : హుజురాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ విజ్ఞప్తి

హుజురాబాద్ ప్రజలు ఎందుకు బిజెపిని గెలిపించాలో చెప్పాలి ?

హుజురాబాద్ ప్రజలు ఎందుకు బిజెపిని గెలిపించాలో చెప్పాలి ?

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించిన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ హుజురాబాద్ ప్రజలు ఎందుకు బిజెపిని గెలిపించాలో చెప్పాలని బిజెపి నేతలకు సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసింది ప్రజల కోసం కానప్పుడు ఆయనకు ఎందుకు ఓటు వేయాలంటూ నిలదీశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తే వచ్చిందని, ఈటల రాజేందర్ ప్రజల కోసం రాజీనామా చేస్తే వచ్చింది కాదని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం రైల్వే ప్రతిపాదనలు రద్దు చేస్తే బండి సంజయ్ ఏం చేస్తున్నారు?

కేంద్రం రైల్వే ప్రతిపాదనలు రద్దు చేస్తే బండి సంజయ్ ఏం చేస్తున్నారు?

హుజురాబాద్ జమ్మికుంట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయన తాను ఎంపీగా ఉన్న సమయంలో రైల్వేలైన్ కోసం ఎంతో శ్రమించాను అని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కరీంనగర్ కు రైల్వే ప్రతిపాదనలు కేంద్రం రద్దు చేస్తే ఎంపీ బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రశ్నించారు. బండి సంజయ్ కు చేతకాకపోతే తాను పట్టుబట్టి హుజురాబాద్ రైల్వే లైన్ శాంక్షన్ చేయిస్తానని వినోద్ కుమార్ వెల్లడించారు. అంతేకాదు హుజురాబాద్, జమ్మికుంటను కలిపే అర్బన్ డెవలప్మెంట్ పెడతామని పేర్కొన్నారు.

హుజురాబాద్ జమ్మికుంట మధ్య మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం

హుజురాబాద్ జమ్మికుంట మధ్య మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం

టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిచిన తర్వాత హుజురాబాద్ జమ్మికుంట మధ్య మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
రెండున్నర సంవత్సరాల నుండి కేంద్ర నుండి బండి సంజయ్ ఒక్క రూపాయి నిధులను కూడా తీసుకు రాలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బీజేపీ నేతలు చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో వారికే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిగతా విషయాలు వేటిని పట్టించుకోవద్దని పేర్కొన్న వినోద్ కుమార్ ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై ఎద్దేవా చేశారు.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరింది అందుకే

ఈటల రాజేందర్ బీజేపీలో చేరింది అందుకే

ఈటల రాజేందర్ బాధలు వేరుగా ఉన్నాయని అందుకే ఆయన బిజెపిలో చేరాడంటూ విమర్శించారు వినోద్ కుమార్. జాతీయ రహదారి పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని నిలదీసిన వినోద్ కుమార్ కేంద్రాన్ని ఒప్పించి కొత్త ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత బండి సంజయ్ కు లేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు కేంద్రం కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులు శూన్యమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
అసలు ఈటల రాజీనామా ఎందుకు చేశాడో ఇప్పటివరకు చెప్పలేదని, హుజురాబాద్ అభివృద్ధిపై ఇప్పటివరకు ఈటల రాజేందర్ మాట్లాడడం లేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడారు. ఈటల రాజేందర్ సమస్యను, ఆయన బాధను నియోజకవర్గ ప్రజల మీద రుద్దుతున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
Vinod Kumar, vice-chairman of the Planning Commission, asked why people should vote for Rajender and BJP. He asked people to vote TRS in Huzurabad by-election. He slams bandi sanjay over center is not giving any funds for telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X