Huzurabad Bypoll Results: రెండో రౌండ్ లోనూ బీజేపీ లీడ్ - హోరా హోరీ పోటీ : 359 ఓట్ల ఆధిక్యతలో..!!
హుజూరాబాద్ బై పోల్ లో కౌంటింగ్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. రెండో రౌండ్ లోనూ బీజేపీ స్వల్ప ఆధిక్యత సాధించింది. రెండో రౌండ్ లో బీజేపీకి 193 ఓట్ల మెజార్టీ రాగా.. మొత్తంగా రెండు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 359 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతోంది. రెండో రౌండ్ లో బీజేపీకి 4,851 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్ధికి 4,659 ఓట్లు వచ్చాయి. కాగా, కాంగ్రెస్ అభ్యర్ధికి 220 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యం సాధించారు.

తొలి రౌండ్ లో ఇలా
బీజేపీ 4610, టీఆర్‌ఎస్ 4444, కాంగ్రెస్ 114 ఓట్లు సాధించాయి. కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన ఓట్లు(114) కంటే ఎక్కువగా ఇండిపెండెంట్ రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో హుజూరాబాద్ మండల ఓట్లను లెక్కిస్తారు. హుజూరాబాద్ మండలంలో అధికార టీఆర్ఎస్ బలంగా ఉందని పోలింగ్ మందు అంచనా వేసారు. అయితే, బీజేపీ అక్కడ గట్టి పోటీ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్ 32, చెల్లనవి 14గా ఉన్నాయి.

పోస్టల్ బ్యాలెట్ లో కారు ఆధిక్యత
మొత్తంగా పోస్టల్‌బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. హుజూరాబాద్ మండలానికి చెందిన పోతిరెడ్డిపేట్ గ్రామం (పోలింగ్ స్టేషన్)తో లెక్కింపు మొదలైంది. చివరిగా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి (పీఎస్ నెం.305)కి చెందిన ఈవీఎంలో ఓట్లు లెక్కిస్తారు. 14 టేబుళ్లపై మొత్తం 22 రౌండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 86.64 శాతం ఓటింగ్ శాతం నమోదు కావడం.. పోలైన ఓట్లు 2 లక్షలు దాటడంతో ఫలితం అధికారికంగా వెలువడే సరికి సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు.
Recommended Video

చివరి వరకూ ఉత్కంఠ తప్పదా
మధ్యాహ్నం ఒంటి గంటకు ట్రెండ్ తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో..చివర వరకు కౌంటింగ్ లో ఉత్కంఠ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన లెక్కల పైన ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. అధికార టీఆర్ఎస్ - బీజేపీ నేతలు సైతం ఉత్కంఠగా కౌంటింగ్ తీరును గమనిస్తున్నాయి. అయితే, ఆధిక్యత చాలా స్పల్పంగా ఉండటంతో ఏ రౌండ్ లో అయినా ఫలితాలు మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications