జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం: ఏడాదిపాటు 13 మంది సస్పెండ్
హైదరాబాద్: విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నివారణకు అనేక చట్టాలు వచ్చినా.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఆ భూతం మాత్రం ఏదో ఒక చోట విద్యార్థులను వేధిస్తూనే ఉంది. ర్యాగింగ్ భూతానికి కొందరు బలవుతుండగా, మరికొందరు విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు.
తాజాగా, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. హాస్టల్‌లో జూనియర్లను తమ గదికి పిలిపించి సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ర్యాగింగ్ స్క్వాడ్ కు జూనియర్లు ఫిర్యాదు చేయడంతో.. అధికారులు చర్యలు తీసుకున్నారు.

ర్యాగింగ్‌కు పాల్పడిన 20 మంది సీనియర్ విద్యార్థులపై వేటు వేశారు. 13 మంది విద్యార్థులను హాస్టల్ నుంచి ఏడాదిపాటు, మరో ఏడుగురిని ఒక సెమిస్టర్ పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు, విద్యా సంస్థల్లో ర్యాగింగ్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాగింగ్ కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications