Hyderabad : వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి..
భాగ్యనగరంలో వీధికుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు విడిచాడు. 20 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతిచెందాడు. కుక్క కాట్లకు గురైన ఓ చిన్నారి ఏడాది వయసులోనే కన్నుమూశాడు. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని కుక్కలు రోడ్డుపైకి లాక్కేలి మరీ చంపేశాయి. ఆ బాలుని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పటివరకూ తమతో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండడం చూసిన చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ హృదయ విదారకర సంఘటన మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ కుటుంబంలో జరిగింది. సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో జీవితం సాగిస్తున్నాడు. పెద్దకుమారుడి పేరు నాగరాజు. ఆ బాలుని వయస్సు ఏడాది. అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నాగరాజును 20 కుక్కలు ఒకేసారి ఆ చిన్నారిపై దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాయి. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న సూర్యకుమార్ గానీ ఆ బాలుని తల్లిగానీ గమనించలేదు. పడుకుని లేచి చూసిన సూర్యకుమార్‌కు నాగరాజు కనిపించకపోవడంతో తల్లిదండ్రులిద్దరూ కంగారు పడ్డారు. తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కల వెతికినా ఎక్కడ కనిపించలేదు. చివరకు రోడ్డుపైకి వచ్చి చూసేసరికి నాగరాజును కుక్కలు దాడిచేయడం గమనించారు.

20 కుక్కలు ఒకేసారి చిన్నారిపై దాడి చేసాయి : ఆ తల్లిదండ్రులిద్దరూ పరుగున నాగరాజు దగ్గరికి వెళ్లి ఆ కుక్కలను తరిమేశారు. అప్పటికే నాగారాజు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడాన్ని గమనించారు. ఆ చిన్నారిని ఎత్తుకుని చూడగా అప్పటికే ఆ బాలునికి ఒళ్లంతా కుక్కగాట్లు కనిపించాయి. తల్లిదండ్రులిద్దరూ ఎంత లేపిన బాబు లేవలేదు. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూశాడు. అంతవరకూ తమతో ఆడుతున్న చిన్నారి ఒక్కసారిగా ఉలుకుపలుకు లేకుండా పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలు బాదుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కల దాడిలో మృతిచెందిన చిన్నారి నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.












Click it and Unblock the Notifications