Hyderabad: పీల్చే గాల్లో స్లో పాయిజన్.. ఐఐటీ కాన్పూర్ వార్నింగ్
భాగ్యనగర వాసుల ఊపిరిపై కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. మనం పీల్చే గాలిలో విషపూరిత వాయువులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని ఐఐటీ కాన్పూర్ చేపట్టిన తాజా అధ్యయనం హెచ్చరించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు నగరంలోని గాలి నాణ్యతపై జరిగిన ఈ శాస్త్రీయ విశ్లేషణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాంతాలు కాలుష్యానికి కేంద్ర బిందువులుగా మారుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
శివార్లలో పరిశ్రమలు.. నగరంలో వాహనాలు.. నగర పరిధిలో విడుదలవుతున్న సల్ఫర్ డయాక్సైడ్ (SO2) ఉద్గారాల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో రోజుకు సగటున 10,701 కిలోల SO2 గాలిలోకి విడుదలవుతుండగా, అందులో 91 శాతం కేవలం వాహనాల వల్లే జరుగుతోంది. అయితే, ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. అక్కడ ప్రతిరోజూ 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతోంది. ఇందులో 92 శాతం వాటా పరిశ్రమలదే కావడం గమనార్హం. అంటే నగరం లోపల వాహన ఉద్గారాలు ఊపిరి తీయకుండా చేస్తుంటే, వెలుపల పరిశ్రమలు విషాన్ని చిమ్ముతున్నాయి.

Hyderabad ఆరోగ్యంపై 'నిశ్శబ్ద' దాడి
సల్ఫర్ డయాక్సైడ్ ప్రభావం వెంటనే కనిపించకపోయినా, అది నెమ్మదిగా శరీర అవయవాలను దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డీజిల్, బొగ్గు వంటి ఇంధనాల దహనం వల్ల వెలువడే ఈ వాయువు శ్వాసనాళాల్లో మంట, ఊపిరితిత్తుల వాపుకు కారణమవుతుంది. ఇది దీర్ఘకాలంలో ఆస్తమా వంటి తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ కాలుష్యం వల్ల ఎక్కువ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆరోగ్యంపైనే కాకుండా, పర్యావరణంపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది. SO2 గాలిలోని తేమతో కలిసినప్పుడు ఆమ్ల వర్షాలు కురిసి, నేల సారం తగ్గి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ కార్యాచరణ:
క్లీన్ ఎయిర్ ప్లాన్ ఈ తీవ్ర పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాలుష్య నియంత్రణకు 'క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్'ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2024లో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 40 కొత్త ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే నగరవాసులకు రియల్ టైమ్ డేటా అందించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులను అందుబాటులోకి తేనుంది. భారీ కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తోంది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications