హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవలు ప్రారంభం: 48వేల ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇప్పటికే ఐటీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ నగరంలో మరో ఘనత వచ్చి చేరింది. భారతదేశంలో తన రెండో మౌలిక సదుపాయాల ప్రాంతంగా ఆసియా పసిఫిక్ రీజియన్‌ను ప్రారంభించినట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ మంగళవారం ప్రకటించింది. తమ అప్లికేషన్లు అమలు చేసేందుకు, వినియోగదారులకు సేవలు అందించే సదుపాయం ప్రారంభమైనట్లు వెల్లడించింది.

తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు

కాగా, హైదరాబాద్‌లో డేటా కేంద్రం ఏర్పాటు కోసం భారీ పెట్టుబడి పెడుతున్నట్లు 2020 నవంబర్ 6న అమెజాన్ వెబ్ సర్వీస్ ప్రకటించింది.
డేటా కేంద్రాల ఏర్పాటు కోసం రూ. 20,761 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు గతంలోనే అమెజాన్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అప్పట్లో వ్యాఖ్యానించారు. తాజాగా, డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోపాటు కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహమిస్తూ వినియోగదారుల సేవల కోసం ఆధునాతన సాంకేతికతలను ఉపయోగించనున్నారు.

అమెజాన్ అతిపెద్ద డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం

హైదరాబాద్ నగర శివారు మహేశ్వరంలోని అతిపెద్ద డేటా కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు మంగళవారం అమెజాన్ తెలిపింది. సంస్థ ద్వారా ఏడాదికి 48 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ఆసియా పసిఫిక్ రీజియన్ ద్వారా దశలవారీగా 2020 వరకు రూ. 36,300 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొంది.

హైదరాబాద్‌లో అమెజాన్ 36వేల కోట్ల పెట్టుబడి: కేటీఆర్ హ్యాపీ

అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా కేంద్రం భారతదేశంలో డేటా సెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ. 36,300 కోట్ల భారీ పెట్టుబడితో రీజియన్ ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో క్లౌడ్ కంప్యూటింగ్ శక్తి, అవసరాన్ని గుర్తించామన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగిలే ఈ-గవర్నెన్స్, హెల్త్ కేర్, పురపాలక రంగాల్లో మెరుగైన సేవలు, కార్యకలాపాల కోసం అమెజాన్ వెబ్ సర్వీసె తో కలిసి పనిచేసినట్లు వెల్లడించారు.

English summary
Hyderabad: Amazon Web Services launches AWS Asia Pacific Region, to invest Rs 36k crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X