హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణభయం: గ్యాంగ్‌స్టర్ నయీంకు రూ.3.5కోట్లు ఇచ్చిన బ్యాంకర్

గోకుల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ చీమల జగదీశ్ యాదవ్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోకుల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ చీమల జగదీశ్ యాదవ్..
తెలంగాణ రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ ఈ సేవా ఖాతా నుంచి రూ. 3.4కోట్లను ఇటీవల పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌కు అందించాడు. తనను కిడ్నాప్ చేయడంతోనే అతడు ఈ (స్టేట్ మనీ)మొత్తాన్ని నయీమ్‌కు చేరవేశాడు.

ఈ సేవా కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు ఈ వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు యాదవ్ తోపాటు ఇతర బ్యాంకు డైరెక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

'గోకుల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ సేవా మనీలో ఖాతా తెరిచింది. అయితే, ఎప్పుడు చెక్కులు జారీ చేసినా అవి బౌన్స్ అవుతున్నాయి. ఇలా రూ.3కోట్లకు పైగా బ్యాంకులో ఉండిపోయాయి. సీసీఎస్ ద్వారా క్రిమినల్ కేసు నమోదు చేశాం' అని ఈసేవా అధికారి ఒకరు తెలిపారు.

Hyderabad-based banker paid Rs 3.5 cr to gangster Nayeem

పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బ్యాంకర్

తనకు కూడా నోటీస్ ఇవ్వకుండా ప్రభుత్వం తనను తొలగించిందని యాదవ్ తెలిపాడు. కాగా, ఇతన పదవీకాలం డిసెంబర్ 31 వరకే ఉంది. 'నా కులం వారి సంక్షేమం కోసం సంస్థలో భాగమయ్యాను. 1999లో బెల్లి లలిత యాదవ్.. నయీమ్ గ్యాంగ్ చేతిలో దారుణంగా హత్య చేయబడ్డారు. బెల్లి లలిత గురించిన సమాచారం, ఫొటోలు అందజేసిన మా బ్యాంకులోని ఇద్దరు డైరెక్టర్లు మల్లేష్ యాదవ్, శ్రీరాములు యాదవ్, సభ్యుడు సిద్ధులను కూడా 2001లో హతమార్చాడు నయీమ్. నేను 2012లో బ్యాంక్ ఛైర్మన్ అయ్యాను. 1996లో బ్యాంకు స్థాపించబడింది. 2012 నుంచి 2014 వరకు నయీమ్ గ్యాంగ్ నుంచి తరచూ బెదరింపులు వచ్చాయి' అని జగదీశ్ యాదవ్ తెలిపారు.

'2014లో నన్ను కిడ్నాప్ చేసిన నయీమ్, ఆయన అనుచరులు ఇబ్రహీంపట్నంలోని జనహర్ష ఎన్‌క్లేవ్‌లో ఉంచారు. బ్యాంకును టేకోవర్ చేస్తానని, నన్ను చంపేస్తానని నయీమ్ బెదరించాడు. నా తలను రూ. 5కోట్లుగా పేర్కొన్నాడు. దీంతో నేను రూ. 3.5కోట్లను వాయిదాల ద్వారా నగదు రూపంలో చెల్లించాను. ఈ నగదంతా ఈ సేవా నుంచి ఖాతాదారుల ద్వారా మా బ్యాంకులో జమ అయినదే. ఇది తప్పే, కానీ, నా ప్రాణం కాపాడుకోవడం కోసం రాష్ట్ర డబ్బును వాడుకున్నా' అని యాదవ్ తెలిపారు.

ఇంకా 'నేను ఇదంతా చెప్పినా కూడా నాకు సాయం చేసేందుకు ఎవరూ రాలేదు. భయం కారణంగా నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. నయీమ్ మరణించిన తర్వాత నేను ప్రత్యేక దర్యాప్తు బృందం డైరెక్టర్ వై నాగిరెడ్డి కలిసి ఫిర్యాదు చేశాను. అంతేగాక, ముఖ్యమంత్రికి కూడా దరఖాస్తు చేశాను, ఈ సేవా అధికారులకు కూడా తాను వాడుకున్న మొత్తాన్ని తిరిగిస్తానని చెప్పా' అని పేర్కొన్నాడు.

కాగా, గోకుల్ బ్యాంక్ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం.. యాదవ్ తోపాటు 14మంది డైరెక్టర్లను తొలగించి, డి విజయలక్ష్మిని ప్రత్యేక అధికారిగా నియమించింది. ఆమె బ్యాంకు వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

English summary
Gokul Cooperative Urban bank ex-chairman Cheemala Jagadish Yadav, who allegedly swindled Rs 3.4 crore from the Telangana state Income-Tax department’s e-Seva account, claims that he paid the “state’s money” to gangster Nayeemuddin in order to save his life after he was abducted by the gangster.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X