అందరూ మెచ్చిన హైద్రాబాద్ బిర్యానీకి దక్కని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్, ఎందుకంటే?

సరైన ఆధారాలు సమర్పించని కారణంగా హైద్రాబాద్ బిర్యానీకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ దక్కలేదు.2009 నుండి హైద్రాబాద్ బిర్యానీ అసోసియేషన్ జిఐ ట్యాగ్ కు ధరఖాస్తు చేస్తున్నారు.కాని, సరైన ఆధారాలు చూపకపోవడంతో

హైదరాబాద్:హైద్రాబాద్ బిర్యానీ పేరు చెప్పగానే నోరూరిపోతోంది. అయితే హైద్రాబాద్ కు వచ్చిన వారేవరైనా ఈ బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరు.అయితే ఇంతగా ప్రాచుర్యం పొందిన హైద్రాబాద్ బిర్యానీకి మాత్రం జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ మాత్రం దక్కలేదు.

హైద్రాబాద్ బిర్యానీ అంటే మక్కువ లేనిది ఎవరికీ, ఈ బిర్యానీ కోసం ప్రతి గంటలకొద్ది వేచి చూస్తారు.అయితే ఈ బిర్యానీకి మాత్రం జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ మాత్రం దక్కలేదు.

క్రికెటర్లు , సినీ తారలు పెద్ద ఎత్తున ఈ బిర్యానీ అంటే మక్కువ చూపిస్తారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారైతే ఈ బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరు.అయితే ఈ బిర్యానీకి ఉన్న ప్రత్యేకత అదే.

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ , ధోని లాంటి ప్రముఖులు హైద్రాబాద్ బిర్యానీ అంటే మక్కువ చూపేవారు.అయితే హైద్రాబాద్ బిర్యానీ అంటే అంత ఇంతా క్రేజీ కాదు.అందుకే ఈ బిర్యానీ కోసం క్యూ కట్టేవారు కూడ లేకపోలేదు.

హైద్రాబాద్ బిర్యానీకి ప్రత్యేకత

హైద్రాబాద్ బిర్యానీకి ప్రత్యేకత

హైద్రాబాద్ బిర్యానీకి రుచి ప్రత్యేకంగా ఉంటుంది. నిజాంల కాలం నుండి ఈ బిర్యానీ ప్రత్యేకంగా ఉంటుంది.దీని రుచే ఈ బిర్యానీకి డిమాండ్ ఉంటుంది. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఈ బిర్యానీ రుచి కోసం పరితపిస్తుంటారు. ఈ బిర్యానీ వండే పద్దతి వేరుగా ఉంటుంది.దీంతో ఈ బిర్యానీ రుచి తేడాగా ఉంటుంది.అందుకే ఈ బిర్యానీ అంటే చాలామంది ఇష్టపడతారు.అదే సమయంలో ఈ బిర్యానీ పేరుతోనే హోటళ్ళు పుట్టుకొచ్చాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ బిర్యానీ కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు.

జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ను సంపాదించలేకపోయిన బిర్యానీ

జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ను సంపాదించలేకపోయిన బిర్యానీ

తొలిసారిగా నిజాం నవాబుల కాలంలో హైద్రాబాద్ కు బిర్యానీని పరిచయం చేశారు.అయితే ఈ బిర్యానీ ఆనాటి నుండి తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. రుచితో పాటు అన్ని రకాల్లో హైద్రాబాద్ బిర్యానీ అంటే ప్రత్యేకంగా చూస్తారు. హైద్రాబాద్ బిర్యానీ మాత్రం జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేష్ మాత్రం సంపాదించలేకపోయింది. ఈ ట్యాగ్ కోసం హైద్రాబాద్ బిర్యానీ అసోసియేషన్ ధరఖాస్తు చేసింది. అయితే దీనికి సంబందించిన చారిత్రక సమాచారాన్ని అందించడంలో అసోసియేషన్ వైఫల్యం చెందింది.దీంతో హైద్రాబాద్ బిర్యానీకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ సంపాదించలేకపోయింది.

జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఎందుకు

జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఎందుకు

ఏవైనా ఉత్పత్తులు ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో దొరికితే వాటికి జిఐ ట్యాగ్ ఇస్తారు.అయితే ఆప్పుడు ఆ పేరును ట్యాగ్ పొందిన వారు మాత్రమే వాడుకోవాలి. ఇతరులు వాడుకోకూడదు.ఒక వేళ అలా వాడుకొంటే వారిపై చర్యలు తీసుకోవడానికి కూడ వీలుంటుంది.తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి, గద్వాల చీరెలు జిఐ గుర్తింపును తెచ్చుకొన్నాయి.ఇదే తరహలో హైద్రాబాద్ బిర్యానీ కోసం కూడ ప్రయత్నాలు చేశాయి.

బిర్యానీకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నాలు

బిర్యానీకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నాలు

2009 ఏప్రిల్ మాసంలో హైద్రాబాద్ బిర్యానీ అసోసియేషన్ హైద్రాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ కోసం ధరఖాస్తు చేశారు. అయితే తమ నిబంధనల ప్రకారంగా సంబంధిత పత్రాలు ఇవ్వాలని ఆ సంస్థ కోరింది.హైద్రాబాద్ బిర్యానీకి సంబందించిన చారిత్రక ఆధారాలు సమర్పించాలని కోరింది. అయితే అలాంటి ఆధారాలను చూపడంలో హైద్రాబాద్ బిర్యానీ అసోసియేషన్ వైఫల్యం చెందింది.

డాక్యుమెంటరీలు సమర్పించినా ప్రయోజనం దక్కలేదు

డాక్యుమెంటరీలు సమర్పించినా ప్రయోజనం దక్కలేదు

2010 ఆగష్టు మాసంలో మరోసారి ఈ విషయమై ఈ అంశంపై చర్చ జరిగింది. అప్పుడు కూడ డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాలని కోరారు. హైద్రాబాద్ బిర్యానీ తయారీదారుల సంఘం నుండి సరైన సమాధానం రాలేదు. 2013 జూలైలో మరోసారి లేఖ రాశాడు. ధరఖాస్తులో ఉన్న లోటుపాట్లను సవరించాల్సిందిగా చెప్పారు.అయినా సమాధానం ఏమీ రాలేదు. తమ సూచనలు పాటించడం లేదంటూ 2018 మే నెలలో ఇంకోసారి గట్టిగా చెప్పారు.ఈ సారి కూడ సమాధానం రాలేదు. ఈ ఏడాది జనవరి 23వ, తేదిన చిట్టచివరిసారిగా షోకాజ్ నోటీసు జారీ చేశారు.అప్పుడు కూడ సంఘం మౌనంగా ఉండిపోయింది. దాంతో ధరఖాస్తును తిరస్కరిస్తున్నామని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+