హైదరాబాద్ పేలుళ్ల కేసు: దుబాయ్ నుంచి సిటీకి ఉగ్రవాది అజీజ్
హైదరాబాద్: ఉగ్రవాది అజీజ్‌ను హైదరాబాద్ తీసుకు రావడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాట్లు చేసుకుంది. దుబాయ్‌లో పట్టుబడిన అజీజ్‌ను మంగళవారం సాయంత్రంలోగా లక్నోకు తరలించే అవకాశం ఉంది. లక్నో నుంచి హైదరాబాద్ సిట్ నగరానికి తీసుకువస్తుంది.
సికింద్రాబాదులోని గణేష్ ఆలయం పేలుళ్ల కుట్ర కేసులో అజీజ్‌ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్, సిమిలతో కలిసి అతను పలు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.

అజీజ్ ఎనిమిదేళ్లుగా దుబాయ్‌లో తలదాచుకున్నాడు. హైదరాబాదులోని వివిధ పేలుళ్లలో అతను కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications