9 ఆర్టీసీ డిపోల మూత..? 8 ఎకరాల స్థలం లీజు/అద్దె.. కారణమిదే..? కార్మికసంఘాల ఆగ్రహాం
టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక మార్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త హైదరాబాద్ సిటీలో డిపోలు తగ్గిస్తున్నారనే సమాచారం బయటకు వచ్చింది. దీనిపై కార్మిక సంఘాలు గుర్రుమంటున్నాయి. ఇదీ మంచి పద్దతి కాదని ఫైర్ అవుతున్నారు. ఇంతకీ డిపోలను తగ్గించడం వెనక కారణం ఏమీ ఉంది. తెలుసుకుందాం పదండి.

9 డిపోలు..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ బస్ డిపోల సంఖ్యను తగ్గించాలని అనుకుంటోంది. సిటీలో 9 డిపోలను మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నారని ఆర్టీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకే డిపోలను తగ్గిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్‌భవన్ పక్కనే ఉన్న హైదరాబాద్-3 డిపోలోని 30 బస్సులను మియాపూర్ డిపోకు మళ్లించారు.
డిపోలో పనిచేస్తున్న 135 మంది సిబ్బందిని ఇతర డిపోలకు బదిలీ చేశారు. అలాగే మేనేజర్‌ను బస్‌భవన్‌కు బదిలీ చేశారు. పికెట్, బీహెచ్‌ఈఎల్ డిపోల్లోని బస్సులను కూడా చుట్టుపక్కల డిపోలకు తరలిస్తున్నారు. ముందుగా బస్సులు తగ్గించి, సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి ఆ డిపోలను కూడా త్వరలో ఎత్తివేస్తారని ప్రచారం జరుగుతోంది.

తగ్గింపు ఇందుకేనా..?
గ్రేటర్ జోన్‌లో భారీగా వస్తున్న నష్టాలను తగ్గించుకునేందుకే డిపోలను కుదిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. డిపోల స్థలాలను లీజుకిచ్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలను 20కి తగ్గిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గ్రేటర్‌లో ఆర్టీసీ రోజూ రూ.కోటి పైగా నష్టాలు వస్తున్నాయి. 2019 వరకు గ్రేటర్ జోన్‌లో 3800 బస్సులు ఉండేవి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె అనంతరం డొక్కుగా మారాయని వెయ్యి బస్సులను తొలగించడంతో ఈ సంఖ్య 2800కి తగ్గింది. బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో డిపోల సంఖ్య తగ్గించాలని ఆర్టీసీ భావించింది. బస్సులు తక్కువగా ఉన్న డిపోలను క్రమంగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఒక్కో డిపోకు 8 ఎకరాల స్థలం
గ్రేటర్ పరిధిలో ఒక్కో డిపోకు 8 ఎకరాలకు వరకు స్థలాలు ఉన్నాయి. ఆయా ఖాళీ స్థలాలపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పట్లో గ్రేటర్‌కు కొత్త బస్సులు వచ్చే అవకాశాలు లేదు. డిపోలు తగ్గించినా పెద్దగా సమస్యలు ఉండవనే అభిప్రాయానికి ఆర్టీసీ వచ్చింది. ఖాళీ చేసిన డిపోల స్థలాలను వాణిజ్య అవసరాలకు లీజు/అద్దె ప్రాతిపదికన ఇస్తే భారీగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
సంస్థ అప్పుల్లో ఉందని.. దీంతో ఆదాయ మార్గంపై ఫోకస్ చేసినట్టు అర్థమవుతోంది. గ్రేటర్‌లో తగ్గించిన బస్ డిపోల స్థలాలు అమ్ముతారా.. లేదంటే 30-40 ఏళ్ల కాలపరిమితితో లీజుకు ఇస్తారా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. 29 డిపోలు ఉండగా 2800 బస్సులే ఉన్నాయి. ఈ బస్సులకు 20 డిపోలు సరిపోతాయని ఆర్టీసీ భావిస్తోంది. వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న డిపోలను గుర్తించి వాటిలో కొన్నింటిని ఎంపిక చేసి, ఆ స్థలాలను లీజు ప్రాతిపదికన ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఇవే ఆ డిపోలు
ముషీరాబాద్ పరిధిలో ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలనుకున్నారు. కానీ ఆ ప్రతిపాదనలు ఆదిలోనే ఆగిపోయాయి. ఈ సారి పక్కా ప్రణాళికలతో ఆర్టీసీ ఖాళీ స్థలాలపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకొని డిపోల సంఖ్య తగ్గిస్తున్నారని తెలుస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్, మెహిదీపట్నం, కంటోన్మెంట్, ముషీరాబాద్, రాజేంద్రనగర్, మిథాని, ఉప్పల్, రాణిగంజ్, హకీంపేట, కంటోన్మెంట్, కుషాయిగూడ వంటి డిపోల వద్ద ఖాళీ స్థలాలను పరిశీలించి వాటిలో ఎక్కువ ఆదాయం వచ్చే డిపోలను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
గ్రేటర్ జోన్‌లో నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకే డిపోలను కుదించనున్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీలో కొత్త నియమకాలు లేకపోవడంతో పలు డిపోల్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఈ క్రమంలో డిపోలను తగ్గించుకుంటూ అక్కడి సిబ్బందిని ఇతర డిపోలకు బదిలీ చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్‌లో ఏటా రూ.350 కోట్లకు పైగా నష్టాలు వస్తున్నాయని, వీటిని తగ్గించుకుంటూ వాణిజ్య ఆదాయం పెంచుకోకపోతే భవిష్యత్తులో ఆర్టీసీ అప్పులు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

నష్టమే..
నగరంలో డిపోలు తగ్గిస్తే ఆర్టీసీకి మరింత నష్టం జరిగే ప్రమాదముంది. డిపోలు తగ్గిస్తుండడంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. డిపోలు ఖాళీ చేయించి ఆర్టీసీ స్థలాలు లీజుకిచ్చినా అమ్మేసినట్లే భావించాల్సి వస్తుంది. ఆర్టీసీకి కొత్త ఎండీ, చైర్మన్ వచ్చాక ఎన్నో మార్పులు వస్తాయని కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు డిపోలు తగ్గిస్తూ సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారు.
Recommended Video

ఇదీ మాత్రం తగదు
ఆర్టీసీ ఎండీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్.. ఒక్కో కీలక అంశంపై ఫోకస్ చేస్తున్నారు. ఏళ్లుగా జరగని పనులను చకచకా చేస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంస్థకు ఆదాయంపై ఫోకస్ చేశారు. దసరా సమయంలో సిటీ నుంచి జనం ఊర్లకు వెళుతుంటారు. అప్పుడు అదనపు చార్జీ లేకుండా బస్సులను నడిపించారు. మంచి ఆదాయమే సమకూరింది.
ఆర్టీసీలో కొన్ని విభాగాలకు కొలువులను ప్రకటించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులను పెళ్లి కోసం బుక్ చేసుకుంటే గిప్టులను అందజేస్తున్నారు. ఈసారి జర్నలిస్టులకు కూడా గుడ్ న్యూస్ అందజేశారు. 2/3 ఆన్ లైన్ చేశారు. తర్వాత అడిగిన సమస్యలపై కూడా స్పందిస్తున్నారు. బస్సులను వేయిస్తున్నారు. కానీ డిపోలను తగ్గించే నిర్ణయంపై మాత్రం వ్యతిరేకత వస్తోంది. కార్మిక సంఘాలు ముక్తకంఠంతో అపోజ్ చేస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications