బిర్యానీ ఉడకలేదనడంతో గొడవ: కస్టమర్లపై దాడి చేసిన వెయిటర్లు, రాజా సింగ్ వార్నింగ్ (వీడియో)
హైదరాబాద్: నగరంలోని అబిడ్స్‌లో ఓ హోటల్లో బిర్యానీ విషయమై తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నూతన సంవత్సర సందర్భంగా ధూల్‌పేటకు చెందిన కొందరు యువతీయువకులు రాత్రి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిర్యానీ సరిగా ఉండకలేదని, తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ సిబ్బందికి చెప్పారు. అయితే దీనికి వారు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
కస్టమర్లు వెయిటర్‌పై దాడి చేయడంతో.. ఆ తర్వాత వెయిటర్లు, హోటల్ సిబ్బంది.. వినియోగదారులపై కర్రలు, కుర్చీలతో దాడికి దిగారు. ఈ క్రమంలో కొంతమంది వినియోగదారులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి, నలుగురు వెయిటర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ధూల్‌పేట మహిళలు, వ్యక్తులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
On the night of December 31st , there was a fight in the Abids Grand Hotel,The hotel staff beat the customers with sticks.#Hyderabad pic.twitter.com/ofqzpITH2l
— Arbaaz The Great (@ArbaazTheGreat1) January 1, 2024
గ్రాండ్ హోటల్ హోటల్ యజమాని, సిబ్బందిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌పై దాడి చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. మరోవైపు, యజమానిని అరెస్టు చేయాలంటూ అబిడ్స్ పీఎస్ ముందు ధూల్‌పేట లోద్ సమాజ్ నాయకులు ఆందోళన చేపట్టారు.
-
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications