68రోజుల ఉపవాసంతో మృతి: ఆధారల్లేవంటూ.. ఆరాధన కేసు మూసివేత!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరాధన సముదారియా (13) కేసులో ఆధారాలు లభించలేదంటూ పోలీసులు కేసును మూసేశారు. ఈ కేసులో ఎంత దర్యాప్తు చేసినా ఆధారాలు లభించలేదని, కాబట్టి కేసును మూసివేస్తున్నామంటూ సికింద్రాబ
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరాధన సముదారియా (13) కేసులో ఆధారాలు లభించలేదంటూ పోలీసులు కేసును మూసేశారు. ఈ కేసులో ఎంత దర్యాప్తు చేసినా ఆధారాలు లభించలేదని, కాబట్టి కేసును మూసివేస్తున్నామంటూ సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు బాలల హక్కుల సంఘానికి నోటీసు ద్వారా తెలిపారు.
గత అక్టోబరులో 68 రోజుల పాటు ఉపవాసం చేసిన బాలిక ఆరాధన(13) మృతి చెందింది.
బాలిక మృతిపై స్పందించిన బాలల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పది నెలలపాటు విచారించినా ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.

కాగా, నిర్బంధ కఠిన ఉపవాస దీక్షతో ప్రాణాలు కోల్పోయిన ఆరాధన మరణానికి కారకులైన మతగురువులు, ఆమె తల్లిదండ్రులపై పోలీసులు చర్యలు తీసుకోకుండా కేసును మూసివేస్తున్నారని, కోర్టుకు వెళ్లి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు.
పోలీసులు ఫిర్యాదుదారులను కానీ, స్థానికులను కానీ విచారించకుండా కేవలం ఇది మతాచారాలకు సంబంధించినదనే అభిప్రాయంతో ఉన్నారని ఆరోపించారు. ఉపవాస దీక్షపై బాలిక కుటుంబ సభ్యులు ఓ హిందీ దినపత్రికలో ప్రకటననూ ఇచ్చారని ఇంతకంటే పోలీసులకు ఆధారాలేమి కావాలని ఆయన ప్రశ్నించారు. తూతూ మంత్రంగా విచారణ చేపట్టారన్నారు.
సుదీర్ఘంగా ఉపవాసం ఉండడం వల్లే బాలిక మృతి చెందిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ తమకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సంఘం అధ్యక్షురాలు అనురాధారావు పేర్కొన్నారు. పోలీసుల వైఖరిపై త్వరలో కోర్టును ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
వేసవిలో షిర్డీ టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే అద్భుతమైన టూర్ ప్యాకేజీ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications