హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యాపారి కిడ్నాప్: అరగంటలో ఛే(జి)దించారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ఓ వ్యాపారి కిడ్నాప్ మంగళవారం కలకలం సృష్టించింది. అయితే నగర పోలీసులు అరగంటలో ఆ కిడ్నాప్ ముఠా ఆట కట్టించారు. ఘటన జరిగిన 30 నిమిషాల్లో జంట కమిషనరేట్ల పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఖలీం వాసిం(40)కు కర్ణాటకకు చెందిన మహ్మద్ సలీంకు స్క్రాప్ వ్యాపారంలో విభేదాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సయ్యద్ ఖలీంను కర్నాటకు తీసుకువెళ్లి నిర్బంధించి, నగదును వసూలు చేయాలని భావించిన సలీం కర్ణాటక నుంచి ఓ గ్యాంగ్‌ను నగరానికి పంపించాడు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెం. 13 బాధితుడు సయ్యద్ ఖలీం ఇంటి వద్ద కర్ణాటక గ్యాంగ్ మాటు వేసింది. ఈ క్రమంలో అతడు పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వెంటనే గ్యాంగ్ సభ్యులు ఖలీంను బలవంతంగా బొలేరోలోకి ఎక్కింంచారు.

ఆ కిడ్నాపర్లు నారాయణగూడ మీదుగా కర్నూలు హైవే వైపు వెళ్లారు. సంఘటనను గమనించిన ఖలీం భార్య ఫాతిమా నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేసి, కిడ్నాప్ విషయాన్ని తెలిపింది. వెంటనే ఇన్‌స్పెక్టర్ హైదరాబాద్, సైబరాబాద్ మెయిన్ కంట్రోల్‌తోపాటు అన్ని పోలీస్‌స్టేషన్లకు అప్రమత్తం చేశారు. కర్నాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న వైట్ కలర్ బొలేరోను ఆపాలని అన్ని పెట్రోలింగ్ మొబైల్, ఇంటర్‌సెప్‌టర్ వాహనాలను అలర్ట్ చేశారు.

మొయినాబాద్ అమ్దాపూర్ చౌరస్తా వద్ద పెట్రోలింగ్ మొబైల్ సిబ్బంది బొలేరో వాహనాన్ని గమనించి 5 కిలో మీటర్లు వెంబడించి పట్టుకున్నారు. దీంతో కిడ్నాప్ కేసు అరగంటలో సుఖాంతమైంది. ప్రాథమికంగా మొయినాబాద్ పోలీసులు విచారణ జరిపి కేసును తదుపరి విచారణ కోసం నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.

డబ్బులే కిడ్నాప్‌కు కారణం

కిడ్నాపర్ల అరెస్ట్

కిడ్నాపర్ల అరెస్ట్

నగరంలో ఓ వ్యాపారి కిడ్నాప్ మంగళవారం కలకలం సృష్టించింది. అయితే నగర పోలీసులు అరగంటలో ఆ కిడ్నాప్ ముఠా ఆట కట్టించారు. ఘటన జరిగిన 30 నిమిషాల్లో జంట కమిషనరేట్ల పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని జైలుకు తరలించారు.

కిడ్నాప్ ఛేదించారు

కిడ్నాప్ ఛేదించారు

వివరాల్లోకి వెళితే.. నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఖలీం వాసిం(40)కు కర్ణాటకకు చెందిన మహ్మద్ సలీంకు స్క్రాప్ వ్యాపారంలో విభేదాలు వచ్చాయి.

కిడ్నాప్ ఛేదించిన పోలీసులు

కిడ్నాప్ ఛేదించిన పోలీసులు

ఈ నేపథ్యంలో సయ్యద్ ఖలీంను కర్నాటకు తీసుకువెళ్లి నిర్బంధించి, నగదును వసూలు చేయాలని భావించిన సలీం కర్ణాటక నుంచి ఓ గ్యాంగ్‌ను నగరానికి పంపించాడు.

కిడ్నాప్ ఛేదించిన పోలీసులు

కిడ్నాప్ ఛేదించిన పోలీసులు

మంగళవారం ఉదయం 9.00 గంటలకు హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెం. 13 బాధితుడు సయ్యద్ ఖలీం ఇంటి వద్ద కర్ణాటక గ్యాంగ్ మాటు వేసింది. ఈ క్రమంలో అతడు పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వెంటనే గ్యాంగ్ సభ్యులు ఖలీంను బలవంతంగా బొలేరోలోకి ఎక్కింంచారు.

ఇనుప తుక్కు వ్యాపారం చేస్తున్న సయ్యద్ ఖలీం(40)కు ముంబయి, గోవా తదితర ప్రాంతాల్లో కూడా వ్యాపారం కేంద్రాలున్నాయి. అదేవిధంగా కర్నాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన సలీం(38) సైతం ఇనుప తుక్కు వ్యాపారమే చేస్తున్నాడు. వీరిద్దరిది ఒకే వ్యాపారం కావడంతో పరిచయం ఏర్పడింది. నిరుడు ఖలీం ఓ ఓడ(షిప్)కు సంబంధించిన ఇనుప తుక్కును సలీంకు ఇచ్చేందుకు రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

దీనికి సంబంధించిన మొత్తం డబ్బులు మూడు దఫాలుగా సలీం ఆన్‌లైన్ ద్వారా ఖలీం ఖాతాలో జమ చేశాడు. కానీ, ఖలీం మాత్రం షిప్ స్క్రాప్‌ను సలీంకు అందించలేకపోయాడు. దీంతో అతడిని కిడ్నాప్ చేసి సొమ్ము రాబట్టుకునేందుకు సలీం పథకం వేశాడు. ఈ క్రమంలో అతడు గ్యాంగ్‌ను హైదరాబాద్‌కు రప్పించి ఖలీం కిడ్నాప్‌కు యత్నించి దొరికిపోయారు.

English summary
The Cyberabad police foiled a kidnap bid in the city’s outskirts on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X