హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన కుమార్తె మృతిలో ఉన్న అనుమానాలన్నింటిని కమిషనర్ నివృత్తి చేశారని దేవి తండ్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దేవి మృతి కేసును ఛేదించిన పోలీసులు ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఇది హత్య కాదని, ప్రమాదమేనని తేల్చారు.

ఈ నేపథ్యంలో దీనిపై దేవి తండ్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రమాదం జరిగిన సమయానికి, ఆసుపత్రికి తీసుకు వెళ్లిన సమయానికి మధ్య దాదాపు అరగంట సమయం వృథా అయిందన్నారు. ఆ సమయంలో భరతసింహా రెడ్డి తన ఫోన్ తీసి ఉంటే తన కుమార్తె ప్రాణాలతో దక్కే అవకాశముండేదన్నారు.

అదే సమయంలో కారు డెడ్ ఎండ్ వైపు ఎందుకు వెళ్లిందో స్పష్టత రాలేదన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును అక్కడ నుంచి తొలగించడం వల్లే తమకు అనుమానాలు కలిగాయన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తొలగించి ఏసీపీకి దర్యాఫ్తు అప్పగించడంతో కేసు దర్యాఫ్తు స్వయంగా పర్యవేక్షించిన సీపీ మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

భరతసింగా రెడ్డికి రిమాండ్

దేవి మృతి కేసులో నిందితుడు భరతసింహా రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. తన స్నేహితురాలిని పబ్ నుంచి తీసుకెళ్లి ఇంట్లో దించాలన్న తొందర, మద్యం సేవించిన స్థితి వెరసి దేవి ఇంటికి సమీపంలోనే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనగా.. ఆమె అక్కడికక్కడే మరణించింది.

భరతసింహా రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం తొలుత ఆసుపత్రకి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అతనికి ఈ నెల 23వ తేదీ వరకు జడ్జి రిమాండ్ విధించారు. అతనిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

దేవి తండ్రి నిరంజన్ రెడ్డి

దేవి తండ్రి నిరంజన్ రెడ్డి

తన కుమార్తె దేవి మృతిలో ఉన్న అనుమానాలన్నింటిని కమిషనర్ నివృత్తి చేశారని దేవి తండ్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

దేవి రెడ్డి

దేవి రెడ్డి

బీటెక్ విద్యార్థిని దేవి మృతి కేసు మిస్టరీ వీడిన విషయం తెలిసిందే. ఆమె రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారని హైదరాబాద్ నగర పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులో సీటుబెల్టు పెట్టుకోకుండా అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపినందునే ప్రమాదం జరిగిందని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. దేవి మృతిపై ఆమె కుటుంబం వ్యక్తంచేసిన సందేహాలను ఆదివారం మీడియా ఎదుట నివృత్తి చేశారు.

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

ఈ నెల ఒకటో తేదీన జూబ్లీహిల్స్‌లోని హుడా కాలనీలోని రోడ్ నంబర్ 70లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూబ్లీహిల్స్ డీకే నగర్ వాసి అయిన నిరంజన్ రెడ్డి కూతురు దేవి మృతికి కారణమైన డ్రైవర్‌పై చర్య తీసుకోవాలన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవి తన తండ్రి నిరంజన్ రెడ్డితో మాట్లాడిన ఏడు నిమిషాల్లోపు ప్రమాదం జరిగిందన్నారు.

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

తన కూతురు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ నెల 3న నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో శాస్త్రీయంగా చేపట్టిన దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతురాలిపై లైంగికదాడి, హత్యచేశాకే ఇక్కడ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారనే ఆరోపణలు వాస్తవం కాదని తేల్చిచెప్పారు. గచ్చిబౌలిలోని బీట్స్‌ఫర్ మినిట్ పబ్ నుంచి భరత్‌సింహా రెడ్డి కారులో దేవి.. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలోకి వచ్చారన్నారు.

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

రోడ్ నంబర్ 70 వద్ద స్పీడ్‌గా నడపడంతో కారును పక్కకు తిప్పుతుండగా చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎడమవైపు కూర్చున్న దేవి తలకు, పక్కటెముకలకు తీవ్రగాయాయ్యాయి. ప్రమాదం జరగ్గానే భరత్‌సింహా రెడ్డి కారు దిగి దేవీదేవీ అంటూ కారు చుట్టూ తిరిగాడు. కారులో పడిపోయిన దేవి మొబైల్‌ఫోన్ సైలెంట్‌లో ఉండటంతో తండ్రి కాల్ చేసినా సమాధానం ఇవ్వలేదు.

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

అప్పుడే పాయింట్‌బుక్‌లో సంతకం చేసేందుకు వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ప్రమాదాన్ని గుర్తించి అక్కడున్న వాచ్‌మన్ సాయంతో కారులోనుంచి దేవిని బైటకు తీసి, 108కు ఫోన్‌చేశారు. భరత్ తండ్రి ఫోన్ చేయడంతో ప్రమాదం విషయం చెప్పారు. వెంటనే భరత్ తండ్రి తన భార్యతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. కారులో ఉన్న దేవి ఫోన్‌ను భరత్ తీసి పోలీసులకు అప్పగించాడు.

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

దేవి మృతి.. 7 నిమిషాల్లోనే: అనుమానాలు తొలిగాయి.. తండ్రి (పిక్చర్స్)

గాయపడిన దేవిని అపోలో ఆసుపత్రికి తరలించగా, ఆమె మృతి చెందింది. ఉదయం 4.36 గంటలకు దేవి తండ్రి ఫోన్‌చేసినప్పుడు పోలీసులు ప్రమాద సమాచారం తెలిపారు. క్లూస్ టీం ప్రమాద వివరాలు సేకరించి క్రేన్ సాయంతో ఆ కారును తొలగించామన్నారు. ఈ కేసుపై శాస్త్రీయ ఆధారాలతో అవగాహనకు వచ్చామే గానీ దర్యాప్తు ముగియలేదన్నారు. భరత్‌సింహారెడ్డిపై 304 (పార్ట్ 2) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

English summary
Hyderabad cops say engineering student died in accident, no proof of foul play
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X