హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ క్రైమ్: అతని తీరే వేరు, టార్గెట్ ఇలా... పిక్చర్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో వివిధ నేరాలకు సంబంధించిన గుట్టును పోలీసులు విప్పారు. గురువారంనాడు అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వీటిలో ఘరానా మోసాల నుంచి చోరీలకు పాల్పడేవారి వరకూ ఉన్నారు.

అమాయకులను మోసం చేస్తూ అందినంత దండుకున్న ఓ అంతరాష్ట్ర ఘరానా మోసగాడిని టాస్క్‌పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ బి.లింబారెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

బెంగళూరుకు చెందిన ఎస్.శివకుమార్(26) గతంలో చెన్నైలో పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలై 2015లో హైదరాబాద్‌కు మకాం మర్చాడు. ఈ క్రమంలో సులువుగా డబ్బులు సంపాదించేందుకు అదృశ్యమైన వ్యక్తుల కుటుంబ సభ్యులనే టార్గెట్‌ చేసుకున్నాడు.

బంధువుల ఇంట్లోనే చోరీలు....

ఇదిలావుంటే, దుర్వ్యసనాలకు బానిసలైన ఇద్దరు మిత్రులు డబ్బుల కోసం బంధువుల ఇళ్లలోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. హైదరాబాదులోని చాంద్రయాణగుట్ట పీఎస్ పరిధిలో జరిగిన చోరీ ఘటనలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదనపు డీసీపీ బాబురావు కథనం ప్రకారం.. తాళ్లకుంట ప్రాంతంలో నివసించే మహ్మమద్ నూరిద్దీన్(20) పూల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. శాస్త్రిపురానికి చెందిన సయ్యద్ ముజఫర్(29) ఎంఎం జ్యువెల్లరీ పేరుతో బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు.

ప్రయాణికులే టార్గెట్

రైల్వే ప్రయాణికులను లక్ష్యం చేసుకుని బ్యాగ్‌లు, నగదును తస్కరిస్తున్న ఓ ముఠాను సికింద్రాబాదు గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.22 వేల నగదు, రూ.1400(సౌదీ రియాల్స్) విదేశీ కరెన్సీ, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మహంకాళి ఏసీపీ గంగాధర్, ఇన్‌స్పెక్టర్ రాంచంద్రారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన హరి ఓంకుమార్(28), అతడి స్నేహితులు సంతోష్, అశోక్‌తో పాటు మరో 9 మందితో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. వీరు రైల్వే ప్రయాణికలను టార్గెట్‌గా చేసుకుని, అమాయకులకు మాయమాటలు చెప్పి, వారి వద్ద ఉన్న విలువైన సొత్తుతో పారిపోతారు..

ముంబై, బెంగళూరు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నారు. ఇటీవల ఈ ముఠా చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు గోపాలపురం పోలీసులను అశ్రయించి ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.వీరి కదలికలపై కన్నేయగా, గురువారం ఇదే తరహా నేరాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు.

అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు

అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు

బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించి లుక్‌ఔట్ నోటీసులు, కరపత్రాల్లోని ఫోన్ నెంబర్లకు ఘరానా మోసగాడు కాల్ చేస్తాడు. అదృశ్యమైన వ్యక్తి తన వద్దే ఉన్నాడని, అతడిని చూపించాలంటే తన వోడాఫోన్ ఎం పైసాకు రీచార్జ్ చేయాలని సూచిస్తాడు. వారు రీచార్జ్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇవ్వకుంటే బాధితులను చంపేస్తానని బెదిరిస్తాడు.

అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు

అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు

ఇటీవల మియాపూర్‌కు చెందిన వ్యక్తి నుంచి ఆ అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు రూ.5,900 వసూలు చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అఫ్జల్‌గంజ్ ఠాణా పరిధిలో నిందితుడు శివను ఆదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా విప్పాడు. అతని వద్ద నుంచి రూ.11వేల నగదు, రెండు నకిలీ గుర్తింపు కార్డులు, 2 సెల్‌ఫోన్లు, డెబిట్ కార్టులను స్వాధీనం చేసుకున్నారు.

బంధువుల ఇంట్లోనే చోరీలు..

బంధువుల ఇంట్లోనే చోరీలు..

సంపాదించిన డబ్బులు సరిపోకపోవడంతో నూరుద్దీన్ దూరపు బంధువైన మహ్మమద్ బషీరుద్దీన్ ఇంట్లో చోరీ చేయాలనుకున్నారు. ఈ నెల మొదటి వారంలో మహ్మమద్ బషీరుద్దీన్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయం గమనించి, మారు తాళం చెవిలతో ఇంట్లోకి ప్రవేశించి, దాదాపు 27 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదును దొంగిలించారు.

బంధువుల ఇంట్లోనే చోరీలు..

బంధువుల ఇంట్లోనే చోరీలు..

భాదితులు చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు విశ్వసనీయ సమచారం మేరకు నూరుద్దీన్ ఇంటిపై దాడి చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన క్రైం టీంను అభినందించారు. సమావేశంలో ఏసీపీ ఎంఏ భారీ, ఇన్‌స్పెక్టర్లు ప్రకాష్‌రెడ్డి, శంకర్ పాల్గొన్నారు.

ప్రయాణికులే టార్గెట్

ప్రయాణికులే టార్గెట్

ముఠా నాయకుడు హరి ఓంకుమార్(28)తోపాటు ఉమేష్‌ముక్యా (25), మహ్మద్ ఫరూక్‌షెక్ (19), అనిల్‌కుమార్ (19), పరంజిత్‌కుమార్ (19)ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులు సంతోష్ , అశోక్, వినోద్, వినోద్, వివేక్, సచ్చిన్ తప్పించుకుపోయారు. వీరిలో ఓ మైనర్(14) కూడా ఉండడంతో అతడిని జువైనల్ హోంకు తరలించారు.

English summary
An inter state theif has been arrested by Hyderabad police. And others arrested in different cases in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X