డ్రగ్స్‌కు బానిసలైన 40మంది టెక్కీలు: ఐటీ కంపెనీలకు హెచ్చరికలు
డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎక్సైజ్ శాఖ ఇప్పుడు ఐటీ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు,
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎక్సైజ్ శాఖ ఇప్పుడు ఐటీ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంపై సాక్ష్యాలు సేకరించింది ఎక్సైజ్ విభాగం. ఇప్పటివరకూ 40 మంది టెక్కీలు మాదకద్రవ్యాలను తీసుకుంటున్నట్టు గుర్తించి, వారు పని చేస్తున్న ఐటీ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్‌లో మొత్తం 4లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు ఉండగా.. కెల్విన్ , మొహమ్మద్ అబ్దుల్ వాహిద్, మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్‌ల అరెస్ట్ తరువాత జరిపిన విచారణలో 40 మంది ఐటీ నిపుణులకు వీరు డ్రగ్స్ అందించినట్టు ఎక్సైజ్ అధికారులు తేల్చారు.
నిందితుల సెల్ ఫోన్లు, కాల్ డేటా, మెసేజ్ డేటా నుంచి ఈ సమాచారం సేకరించారు. ఈ వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖకు పంపగా, వారు సదరు కంపెనీలను హెచ్చరించారని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. కాగా, డ్రగ్ కేసులో ఇప్పటికే 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు అందించిన ఎక్సైజ్ శాఖ.. సిట్ అధికారులతో వారిని విచారిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications