ఇక మంచి జీవితం గడుపుతా: డ్రగ్ కేసు నిందితుడు కెల్విన్‌కు బెయిల్, విడుదల
హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్‌కు బెయిల్ మంజూరైంది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది.
ఆదివారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి అతను విడుదలయ్యాడు. మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న కెల్విన్ విడుదల సమయంలో చెప్పాడు.

ఇక నుంచి మంచి జీవితాన్ని గడుపుతానని వెల్లడించాడు. ఈవెంట్ మేనేజరుగా పనిచేసిన కెల్విన్‌కు అంతర్జాతీయ, గోవా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని, టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడనే ఆరోపణలతో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు ఆరు నెలల క్రితం అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications