మందు బాబులకు షాక్: తాగి డ్రైవింగ్ చేస్తే ఆధార్ చెప్పేస్తోంది, 36 వేల మంది చిట్టా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడిపేవారు భవిష్యత్‌లో ఈ రకమైన తప్పులు చేయకుడా హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆధార్‌ నెంబర్‌ను లింక్ చేశారు. మద్యం తాగి పట్టుబడితే ఎన్ని దఫాలు పట్టుబడ్డాడో ఆధార్ నెంబర్‌తో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ఈ కారణంగానే ఎన్ని దఫాలు డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికింది పోలీసులకు సులభంగా తెలిసిపోతోంది.

టెక్నాలజీని హైద్రాబాద్ ‌పోలీసులు జాగ్రత్తగా ఉపయోగించుకొంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ఇప్పటికి ఎన్ని దఫాలు పట్టుబడ్డారనే విషయాలను సులభంగా తెలుసుకొనే ప్రక్రియను చేపట్టారు.

మద్యం తాగి వాహనం నడపాలంటే భయపడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.పోలీసుల వద్ద ప్రతి ఒక్కరి చిట్టా సేకరించి పెట్టుకొన్నారు. ఈ కారణంగా పదే పదే మద్యం తాగి వాహనం నడిపి దొరికితే ఇబ్బందులు తప్పవు.

ఆధార్‌ నెంబర్ చెబితే మద్యం కేసులు బయటపడతాయి

ఆధార్‌ నెంబర్ చెబితే మద్యం కేసులు బయటపడతాయి

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ తరహ ఘటనలు చోటుచేసుకోకుండా అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే అనేక ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి.అయితే ఒక్కసారి మద్యం తాగి పట్టుబడితే ఆదార్‌ నెంబర్‌ను పోలీసులు తమ వద్ద ఉన్న డేటాలో భద్రపరుస్తున్నారు. భవిష్యత్‌లో ఎప్పుడైనా మద్యం తాగి దొరికితే గతంలో ఎన్ని దఫాలు మద్యం తాగి పట్టుబడ్డారో ఆధార్ నెంబర్ చెబితే చాలు చిట్టా బయటపడుతోంది.

పదే పదే మద్యం తాగి వారికోసమే ఆధార్ నెంబర్

పదే పదే మద్యం తాగి వారికోసమే ఆధార్ నెంబర్

పదే, పదే మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు ప్రమాదాలు ఎక్కువగా చేస్తున్నారని గుర్తించిన ఉన్నతాధికారులు వారిని శిక్షించేందుకు ఆధార్ నెంబర్ ప్రక్రియను ముందుకు తెచ్చారు. మద్యం తాగి పట్టుబడిన వారి ఆధార్‌ నంబరు తీసుకొంటారు.. డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నప్పుడు ట్యాబ్‌తో ఫొటో తీసేప్పుడు వారి ఆధార్‌ నంబరును నమోదు చేస్తున్నారు. వీటిని వెంటనే కంట్రోల్‌ రూంకు పంపుతున్నారు. కంట్రోల్‌ రూంలో మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడిపిన ప్రతి వ్యక్తి వివరాలు ఫొటోతో సహా ఉన్నాయి.

36 వేల మంది వివరాలు

36 వేల మంది వివరాలు

మద్యం తాగి పట్టుబడిన వారిలో 36వేల మంది చిత్రాలు, వివరాలు ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారుల వద్ద ఉన్నాయి. కేసుల భయంతో పేర్లు తప్పు చెప్పినా.. ఆధార్‌ నంబర్‌ సక్రమంగా తెలపకపోయినా వెంటనే ట్యాబ్‌ పట్టేసుకుంటుంది. ఒకటి అంతకుమించి పట్టుబడిన వారి వివరాల ఆధారంగా న్యాయస్థాయంలో వారిపై నివేదికను ఇవ్వడం ద్వారా జైలు శిక్ష విధించేందుకు అర్హులయ్యే అవకాశం లేకపోలేదు.

ప్రమాదాలను తగ్గించేందుకు

ప్రమాదాలను తగ్గించేందుకు

మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల హైద్రాబాద్ నగరంలో ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. వారంతంలో ఈ ప్రమాదాలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆధార్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు ట్రాఫిక్ పోలీసులు. తప్పుడు సమాచారం ఇస్తే తెలిసిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్యను క్రమంగా తగ్గించే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Details of all the drunk drivers caught will be linked up to their Aadhaar data, which will affect their career options and in acquiring passports and visas.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి