కూతురుని బయోకెమిస్ట్రీ చందివించాడు.. ఆ తెలివితో తండ్రినే చంపించింది...
హైదరాబాద్: ఎన్నో కష్టనష్టాలకోర్చి కన్న కూతురును ఉన్నత చదువులు చదివిస్తే.. చివరకు ఆ కూతురే ఆ తండ్రి పాలిట యమపాశమైంది. పాతికేళ్లు కంటికి రెప్పలా చూసుకుంటే.. ఆ తండ్రినే కడతేర్చింది ఆ కర్కశపు కూతురు. తండ్రి హత్యకు తన సోదరుడు, తల్లి సహకారం కూడా ఆ కూతురుకు ఉండటం శోచనీయం. వారం రోజుల క్రితం మల్కాజిగిరిలో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దర్యాప్తులు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

చిన్న కూతురుపై ఆశలు...
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పర్బని జిల్లా చెందిన సుతార్ కిషన్ మారుతి రైల్వేలో లోకో డ్రైవర్‌గా పనిచేశాడు. మారుతికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లు అనుపమ, ప్రపూల్, కుమారుడు కిషన్ తండ్రి వద్ద ఉండగా.. మరో కొడుకు పదేళ్ల వయస్సులోనే ఇంట్లో నుంచి పారిపోయాడు. 15ఏళ్ల క్రితం రిటైరైన మారుతి కిషన్.. మల్కాజిగిరి ఆర్టీసీ కాలనీలో 50గజాల్లో ఒక ఇల్లు కొన్నాడు. ఆ తర్వాత పెద్ద కూతురుకు పెళ్లి చేసి పంపించాడు. పదో తరగతి ఫెయిలైన చిన్న కొడుకు అవారాగా తిరుగుతున్నాడు. దీంతో అతడ్ని విడిచి వెళ్లిపోయింది అతడి భార్య. ఇక ఆ తండ్రి కలలన్నీ చిన్న కూతురు ప్రఫూల్‌పైనే పెట్టుకున్నాడు. ఉన్నత చదువులు కూడా చదివించాడు.

మంచి చెబితే కోపం పెంచుకున్నారు..
ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసిన ఆ కూతురు కూడా తండ్రికి ఎలాంటి ఆనందాన్ని మిగల్చలేదు. ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేసేది. చివరకు అతని ప్రాణం కూడా తీస్తుందని తెలుసుకోలేకపోయాడు ఆ తండ్రి. బయో కెమెస్ట్రీ చదివిని చిన్న కూతురు ప్రఫూల్ ఎప్పుడూ ఇంట్లో ఉంటూ అవారా తిరిగే కొడుకును ఎప్పుడు బాగుపడతావురా? అంటూ ఆ తండ్రి తిట్టేవాడు. కూతురుకు కూడా బుద్ధి మాటలు చెప్పేవాడు. తరచూ తండ్రి ఇలా మందలిస్తుంటే ఆ ఇద్దరు తండ్రిపై విపరీతమైన కోపం పెంచుకున్నారు. చివరకు తండ్రిని చంపాలని నిర్ణయానికి వచ్చారు. ఇందు కోసం ఇద్దరు కలిసి పక్కా ప్రణాళిక వేసుకున్నారు.

ఆధారాల్లేకుండా హత్య..
ఎలాంటి అనుమానం రాకుండా హత్య చేయాలని ఇంటర్నెట్ సాయం కూడా తీసుకుంది ఆ తండ్రి ముద్దుల కూతురు. చివరకు ఉమ్మెత్త కాయలను పొడిగా చేసి తండ్రికి పెట్టే భోజనంలో కలిపి పెట్టింది. ఇలా కొద్ది రోజులు కొనసాగించడం తండ్రి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ఓరోజు డోస్ పెంచడంతో చివరకు ప్రాణాలు వదిలాడు.

అసలు విషయం వెలుగులోకి రావడం...
ఆ తర్వాత సొదరుడు, తల్లి సాయం కూడా తీసుకుని.. తండ్రి శవాన్ని కత్తులతో ముక్కలు ముక్కలు చేసింది. తమ తండ్రి కనబడటం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తాము తప్పించుకోవచ్చని, ఇక తండ్రి పింఛను ఎలాగు తల్లికి వస్తుంది కదా ఎలాగు హాయిగా బతికేయొచ్చు అనుకున్నారు.
అయితే, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరిపితే అసలు విషయం వెలుగు చూసింది. ఇంకేముందు హత్యకు ప్లాన్ చేసిన కూతురు, సాయం చేసిన కొడుకు, తల్లి కూడా కటకటాల వెనక్కివెళ్లారు. దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.












Click it and Unblock the Notifications