టీజింగే టెక్కీ ప్రాణాలు తీసింది: గుండెల్లో కత్తి దించింది వీరే(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసు మిస్టరీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. సరదాగా చేసిన టీజింగ్ వ్యాఖ్యలే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. మార్చి 3న తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సంజయ్ జుంగే(24) హత్య కేసులో పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకుల్ని ఆదివారం అరెస్ట్ చేశారు.
నార్త్ జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పార్శీగుట్టకు చెందిన సంజయ్ రెండో తేదీ గచ్చిబౌలిలో విధులు ముగించుకొని అర్ధరాత్రి సమయంలో మియాపూర్‌లో మిత్రుడి ఇంట్లో విందులో పాల్గొన్నాడు. తెల్లవారుజామున 4.30 గంటలకు పంజాగుట్టకు చేరుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు అటుగా వచ్చిన స్విఫ్ట్(ఏపీ15ఏక్యూ 8055) కారులో లిఫ్ట్ అడిగాడు.
అర్ధరాత్రి దాటాకా తరచూ జాయ్‌రైడింగ్‌కు వెళ్లే పాతబస్తీ ప్రాంతానికి చెందిన సయ్యద్ సల్మాన్(18), సయ్యద్ ముబషిరుద్దీన్(22), మహ్మద్ ముష్రాఫ్ అలియాస్ బాబు(19), సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఖాజిర్ యాకుబీ(18) ఆ కారులో ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న సంజయ్‌తో కారు ఎక్కిన అనంతరం యువకులకు వాగ్వాదం జరిగింది. ఎందుకు తాగావని ఆ యువకులు ప్రశ్నించడంతో 'నా సంపాదనతో తాగితే మీకేంట'ని సంజయ్ బదులివ్వడంతో ఘర్షణ జరిగి కారులోనే కొట్టుకున్నారు.
ఈక్రమంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద కారు దిగిన అనంతరం మరోసారి వాగ్వాదం నెలకొనడంతో సల్మాన్, ముబషీర్ తమ వద్ద ఉన్న చిన్న కత్తులతో సంజయ్‌ను రెండు పోట్లు పొడిచి పారిపోయారు. అక్కడికి కొద్దిదూరంలో ఉన్న మహంకాళి గస్తీ పోలీసులు కారును ట్యాంక్‌బండ్ వరకు వెంబడించినా అత్యంత వేగంతో పాతబస్తీకి పారిపోయారు.
కాగా, నిందితులకు, హతుడికి గతంలో ఎలాంటి సంబంధం లేకపోవడంతో దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. కారును వెంబడించిన క్రమంలో దాని నంబరు 8055(ఆంగ్ల అక్షరాల్లో బాస్ రూపంలో)గా గ్రహించిన పోలీసులు అలాంటి కార్లు తెలుగు రాష్ట్రాల్లో 45 వరకున్నాయని గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేశారు.
ఈ నేపథ్యంలో మీడియాలో కారు నంబరు గురించి విస్తృతంగా ప్రచారం జరగడం మీరాలంమండికి చెందిన సయ్యద్ రిజ్వాన్ దృష్టికి వెళ్లింది. అది తన కారుగా గుర్తించి నలుగురు యువకులు అద్దెకు తీసుకెళ్లిన విషయాన్ని తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించాడు. మీరాలంమండికి చెందిన సయ్యద్ రిజ్వాన్ ఇంట్లో తలదాచుకున్న నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి కారుతోపాటు రెండు బైక్‌లు, రెండు కత్తులు, నాలుగు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులకు ఆశ్రయం కల్పించిన రిజ్వాన్‌నూ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు క్రమంలో ముబషిరుద్దీన్‌పై సంతోష్‌నగర్ ఠాణా పరిధిలో గతంలో అత్యాచారం కేసు ఉన్నట్లు గుర్తించారు. సల్మాన్ తన ఇంటి దగ్గర ఉండే అమ్మాయితో ప్రేమ విషయంలో వేరే యువకుడితో వివాదం నడుస్తుండటంతో ఆత్మరక్షణ కోసం కత్తులను వెంట పెట్టుకుని తిరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
కాగా, ఐదుగురు నిందితులను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆదివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

టెక్కీ హత్య-నిందితులు
సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసు మిస్టరీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు.

నిందితులు వాడిన కత్తి
సరదాగా చేసిన టీజింగ్ వ్యాఖ్యలే అతడి ప్రాణాల మీదకు తెచ్చినట్లు తెలిసింది.

మీడియా సమావేశం
మార్చి 3న తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సంజయ్ జుంగే(24) హత్య కేసులో పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకుల్ని ఆదివారం అరెస్ట్ చేశారు.

మీడియా సమావేశం
నార్త్ జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పార్శీగుట్టకు చెందిన సంజయ్ రెండో తేదీ గచ్చిబౌలిలో విధులు ముగించుకొని అర్ధరాత్రి సమయంలో మియాపూర్‌లో మిత్రుడి ఇంట్లో విందులో పాల్గొన్నాడు. తెల్లవారుజామున 4.30 గంటలకు పంజాగుట్టకు చేరుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు అటుగా వచ్చిన స్విఫ్ట్(ఏపీ15ఏక్యూ 8055) కారులో లిఫ్ట్ అడిగాడు.

మీడియా సమావేశం
అర్ధరాత్రి దాటాకా తరచూ జాయ్‌రైడింగ్‌కు వెళ్లే పాతబస్తీ ప్రాంతానికి చెందిన సయ్యద్ సల్మాన్(18), సయ్యద్ ముబషిరుద్దీన్(22), మహ్మద్ ముష్రాఫ్ అలియాస్ బాబు(19), సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఖాజిర్ యాకుబీ(18) ఆ కారులో ఉన్నారు.

హతుడు సంజయ్
మద్యం మత్తులో ఉన్న సంజయ్‌తో కారు ఎక్కిన అనంతరం యువకులకు వాగ్వాదం జరిగింది. ఎందుకు తాగావని ఆ యువకులు ప్రశ్నించడంతో 'నా సంపాదనతో తాగితే మీకేంట'ని సంజయ్ బదులివ్వడంతో ఘర్షణ జరిగి కారులోనే కొట్టుకున్నారు.

హతుడు సంజయ్
ఈక్రమంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద కారు దిగిన అనంతరం మరోసారి వాగ్వాదం నెలకొనడంతో సల్మాన్, ముబషీర్ తమ వద్ద ఉన్న చిన్న కత్తులతో సంజయ్‌ను రెండు పోట్లు పొడిచి పారిపోయారు. అక్కడికి కొద్దిదూరంలో ఉన్న మహంకాళి గస్తీ పోలీసులు కారును ట్యాంక్‌బండ్ వరకు వెంబడించినా అత్యంత వేగంతో పాతబస్తీకి పారిపోయారు.

Click it and Unblock the Notifications