హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ ఫండ్స్ కేసులో ట్విస్ట్: నిజాం డబ్బు తమదేనని తెలంగాణ వాదన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ ఫండ్ కేసులో కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే, ఆ పత్రాలు భద్రపర్చిన హైదరాబాద్‌లోని తార్నాక ఆర్చీవ్స్‌లో లభించ లేదని తెలుస్తోంది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన పలువురు అధికారులు ఆ డాక్యుమెంట్ల కోసం హైదరాబాద్‌కు ఇప్పటికే మూడుసార్లు వచ్చి వెళ్లారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర అధికారి ఒకరు మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రభుత్వం నుంచి వెళ్లినందున కేంద్రానికి ఈ ఫండ్స్ దక్కవని చెప్పారు. నిజాం ప్రభుత్వానికి చెందిన ఆ నిధులు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే చెందుతాయని అన్నారు.

nizam

'1947-48లో హైదరాబాద్ ఖాతా నుంచి లండన్‌కు నిధులు బదిలీ అయ్యాయి. 1947, ఆగస్ట్ 15 తర్వాత కూడా హైదరాబాద్ స్వాతంత్ర్య రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలలో కలిశాయి. కాబట్టి, హైదరాబాద్ నుంచి తరలిని నిధులు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి దక్కాలి' అని తెలంగాణ సీనియర్ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.

'రాష్ట్ర విభజన అనంతరం ఆధారాల కోసం భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వెంటపడుతోంది. హైదరాబాద్‌లో ఉన్న కోసం కేంద్ర ప్రభుత్వం వెదుకులాట ప్రారంభించింది. అయితే, ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో తెలియదు. ఏదేమైనా నిజాం ప్రభుత్వానికి చెందిన నిధులు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయి' ఆ అధికారి తెలిపారు.

హైదరాబాద్‌ ఫండ్‌ కేసు: భారత్‌కు చుక్కెదురు, పాక్‌కే రూ. 350కోట్లు?

కాగా, ఐదు నెలల క్రితం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారు. అయితే, వారికి హైదరాబాద్ ఫండ్స్ కేసుకు సంబంధించిన ఎలాంటి ఫైళ్లు లభించిందలేదు. ఫైళ్ల కోసం వెదుకులాటలో తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ ఏకే గోయల్ కేంద్ర అధికారులకు సహకరించారు.

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కాకముందు పాకిస్థాన్‌కు తరలిపోయిన 35మిలియన్‌ పౌండ్లు(సుమారు రూ.350కోట్లు) భారత్‌కే చెందుతాయని భారత్‌ వాదించింది. అంతేగాక, ఆ నిధులపై పాకిస్థాన్‌కు ఎలాంటి అధికారమూ లేదన్నది భారత్‌ వాదన.

అయితే యూకే కోర్టు రెండ్రోజుల క్రితం ఆ వాదనను తోసిపుచ్చింది. దీంతో పూర్తిస్థాయి విచారణ అనివార్యమైంది. పాకిస్థాన్‌కు అధికారం ఉందన్న దిశగా తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ కేసు విచారణ జరగాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి 75 పేజీల తీర్పును న్యాయమూర్తి హెండర్సన్‌ జె. వెలువరించారు.

English summary
The Central government has been following up the Hyderabad Funds case with the Telangana state government as the required documents supposedly stored at the Tarnaka archives have not been found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X