రైళ్లలో చోరీలు, పట్టివేత: ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు
హైదరాబాద్: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను రైల్వే పోలీసులు గురువారంనాడు పట్టేశారు. ఆ ముఠాలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వారి నుంచి 12 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు ఎం శోభ (36), వి. మంజుల (26) సికింద్రాబాదుకు చెందినవారని, వారు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని సికింద్రాబాదు రైల్వే పోలీసు సూపరింటిండెంట్ ఎస్. జె. జనార్దన్ మీడియాతో చెప్పారు. ఆదాయం సరిపోకపోవడంతో ఆ ఇద్దరు కూడా చోరీలకు దిగారు.
రైళ్లలో చోరీలు చేయడంలో ఆ మహిళలకు వారి పిల్లలు సహకరిస్తూ వస్తున్నారు. రద్దీగా ఉండే కదులుతున్న రైళ్లలోనూ, బుకింగ్ కౌంటర్స్, ఎస్కలేటర్స్ ప్రయాణికులను దోచుకోవడం సాగించారు. ప్లాట్‌ఫారం వద్ద నిలబడే వారిని కూడా దోచుకున్నారు.

బంగారు ఆభరణాలు, నగదు, పర్సులు, చేతి సంచులు కొట్టేయడం పనిగా పెట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు 43 తులాల బంగారం, 9 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. మహిళలను రిమాండ్‌కు తరలించగా, పిల్లలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications