సంక్రాంతికి ఖాళీ అవుతున్న హైదరాబాద్: బస్సులు, రైళ్ళు రష్; ఎంతమంది వెళ్తున్నారో తెలుసా!!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో హైదరాబాదులోని బస్ స్టాండ్ లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడతాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు హైదరాబాద్ లో సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు తమ తమ స్వగ్రామాలకు వెళ్తారు. ఈ క్రమంలో సొంతూరికి వెళ్లే ప్రయాణికులతో ప్రస్తుతం నగరంలో ప్రయాణాల సందడి కనిపిస్తుంది. ఇప్పటికే జోరుగా ప్రయాణాలు కనిపిస్తుండగా, మరో రెండు రోజుల్లో ప్రయాణాల హడావిడి పీక్స్ కు చేరుతుందని తెలుస్తుంది.

సంక్రాంతి పండుగ రద్దీ.. బస్సులు, రైళ్ళలో విపరీతమైన రద్దీ
సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రోజువారి సర్వీసులలో సీట్లన్నీ నిండిపోవడంతో, ప్రత్యేక బస్సుల్లో కూడా రద్దీ కొనసాగుతోంది. ఆర్టీసీ పెట్టిన ప్రత్యేక బస్సులు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులలో సైతం ప్రస్తుతం రద్దీ కనిపిస్తుంది.

హైదరాబాద్ నుండి 4233 ప్రత్యేక బస్సులను పెట్టిన ఆర్టీసీ
హైదరాబాద్ నుండి విజయవాడకు, హైదరాబాద్ నుండి వరంగల్ కు, హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ వయా కర్నూలు వయా బెంగళూరుకు, హైదరాబాద్ నుండి విశాఖపట్నం కు వెళుతున్న బస్సులలో విపరీతమైన రద్దీ ఉంది. హైదరాబాద్ నుంచి వేరు వేరు ప్రాంతాలకు వెళ్లే 3500 బస్సులకు అదనంగా మరో 4233 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ప్రస్తుతం నడుస్తున్న 500 బస్సులతో పాటుగా ప్రత్యేకంగా మరో 1850 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీల బాదుడు, ప్రత్యేక రైళ్ళలోనూ కొనసాగుతున్న రద్దీ
ప్రతి రోజూ నాలుగు వేల నుండి ఐదు వేల బస్సులు నడపడానికి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా కుస్తీ పడుతున్నారు. ఇక సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ప్రైవేటు బస్సుల వాళ్ళు ఛార్జీలను అమాంతం పెంచేశారు. ఆర్టీసీ బస్సులలో ఛార్జీలు యధాతథంగా ఉండగా, ప్రైవేటు బస్సుల్లో మాత్రం రెండు మూడింతలు చార్జీలను పెంచి వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సంక్రాంతికి 18 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసి నడిపిస్తుంది రైల్వే శాఖ. ఈనెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో తదనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంది.

సంక్రాంతికి హైదరాబాద్ నుండి సొంతూళ్ళకు వెళ్ళే వారి సంఖ్య ఎంతంటే
సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక హైదరాబాద్ నగరం నుండి సుమారు 12 లక్షలకు పైగా సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సొంత ఊళ్లకు వెళ్ళే వాళ్ళతో హైదరాబాద్ నగరం సంక్రాంతికి నిర్మానుష్యంగా మారుతుంది. ఈ మేరకు వారి ప్రయాణాలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అదనపు బస్సులను పెట్టి తగిన ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుండగా, సొంతూళ్లకు వెళ్లడానికి రెడీ అయిన ప్రయాణికులతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఛార్జీల బాదుడు పట్ల అసహనం వ్యక్తం చేస్తూనే ప్రయాణికులు తమ తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications