భర్తతో చనువుగా ఉంటుందని వేడినీళ్ళు పోసింది, చివరికిలా..

భర్తతో చనువుగా ఉంటోందనే కోపంతో ఓ మహిళపై భార్య వేడి నీళ్లు పోయండంతో ఆమె మరణించింది. ఈ ఘటన హైద్రాబాద్ రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.

హైదరాబాద్: భర్తతో చనువుగా ఉంటోందనే కోపంతో ఓ మహిళపై భార్య వేడి నీళ్లు పోయండంతో ఆమె మరణించింది. ఈ ఘటన హైద్రాబాద్ రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. బాధితురాలు నాలుగు రోజుల పాటు చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన రాజు, రహమత్‌లు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఉప్పర్‌పల్లి సత్సంగ్‌ విహార్‌కాలనీలో ఉంటున్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఉండే మహారాష్ట్రకు చెందిన చంద్రిక(25) రాజు వద్దే పనిచేస్తోంది.

Hyderabad: Girl killed by her beau’s wife

కొద్దిరోజుల క్రితం రహమత్‌ పుట్టింటికి వెళ్లడంతో రాజు, చంద్రిక మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పుట్టింటి నుంచి తిరిగొచ్చిన రహమత్‌.. చంద్రిక తన భర్తతో చనువుగా ఉండటం చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది.

దీంతో ఈ నెల 7న రాత్రి చంద్రికను మాట్లాడదామని ఇంట్లోకి పిలిచిన రహమత్‌ బాగా కాగిన వేడి నీళ్లను పోసింది. దీంతో చంద్రిక వీపు, ముఖం బాగా కాలడంతో ఆమెను రాజేంద్రనగర్‌ పోలీసులు స్థానికుల సహాయంతో ఉస్మానియాకు తరలించారు. ఆ రోజు నుంచి చికిత్స పొందుతున్న చంద్రిక శనివారం మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+