కాలితో 140 చదరపు అడుగుల బొమ్మ: రికార్డు సృష్టించిన హైద్రాబాదీ జాహ్నవి

Posted By:
Subscribe to Oneindia Telugu
  కాలితో బొమ్మ : రికార్డు సృష్టించిన హైద్రాబాదీ : Video

  హైదరాబాద్: కాలితో పెయింటింగ్ వేసి హైద్రాబాద్ బాలిక జాహ్నవి మాగంటి రికార్డు సృష్టించింది. కాలితో వేసిన పెయింటింగుల్లో జాహ్నవి వేసిన పెయింటింగ్ అతి పెద్దది కావడం గమనార్హం.దీంతో ఆమె పెయింటింగ్ గిన్నిస్ రికార్డు సృష్టించింది.

  సాధారణం అందరం చేతులతో పెయింటింగ్ వేస్తుంటాం. కానీ, దానికి భిన్నంగా కాలితో పెయింటింగ్ వేయడం అసాధారణం. అయితే హైద్రాబాద్‌కు చెందిన జాహ్నవి మాగంటి ప్రపంచ రికార్డును సాధించింది.

  Hyderabad Girl Makes World's Largest Painting By Feet

  ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లోని వేర్విక్ యూనివ‌ర్సిటీలో ఎక‌నామిక్స్‌, ఇండ‌స్ట్రీ ఆర్గ‌నైజేష‌న్‌లో జాహ్న‌వి గ్రాడ్యుయేష‌న్ చేస్తోంది. 140 చ‌ద‌ర‌పు అడుగుల పెయింటింగ్ వేసి ప్ర‌పంచ రికార్డుకెక్కింది.

  గతంలో 100 చదరపు అడుగుల కాలి పెయింటింగ్ రికార్డు. కానీ, జాహ్నవి ఈ రికార్డును తిరగరాసింది.కాలి వేళ్ల మ‌ధ్య పెయింటింగ్ బ్ర‌ష్ ప‌ట్టుకుని, చాలా సునాయాసంగా పెయింటింగ్‌ని పూర్తి చేసింది. పెయింటింగ్ తో పాటు . న‌ట‌న‌, డ్యాన్సింగ్‌,పాటలు పాడడం వంటి క‌ళ‌ల్లో కూడా జాహ్న‌వికి ప్రావీణ్యం ఉంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A girl from Hyderabad has painted a surface of 140 square metres with her feet in an attempt to enter Guinness World Records.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి