వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక హింసపై హైకోర్టు ఇలా., చిన్నారిని రేప్ చేసిన నిందితుడి పిటిషన్ కొట్టివేత

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోవడం పట్ల హైకోర్టు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. నిర్భయ లాంటి చట్టాలు అమల్లోకి వచ్చినా కానీ ఈ తరహ కేసులు నమోదు కావడం పట్ల కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

నిర్భయ చట్టం ఈ తరహ కేసులకు పాల్పడే వారిలో పరివర్తన తెస్తుందని భావించినా, అందుకు విరుద్దంగా జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. మహిళలే కాదు చిన్నారులపై కూడ లైంగిక దాడులు చోటు చేసుకొంటున్న ఘటనలపై కోర్టు తీవ్రంగా ఆందోళనను వ్యక్తం చేసింది.

 Hyderabad HC expresses anguish over increasing crime against women

లైంగిక దాడుల కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించేలా అదికారులు చొరవ చూపాలని కోర్టు ఆదేశించింది. లేకపోతే మహిళలపై దాడులు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందన్నారు. మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

ఐదేళ్ళ చిన్నారిపై రేప్ కేసుపై స్పందించిన కోర్టు

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోహరాబాద్‌లో ఐదేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసిన కేసు విషయమై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది గడ్డమీది భిక్షపతి హత్యకేసులో శిక్ష అనుభవించాడు. అయితే జైలు నుండి భిక్షపతిని విడిపించేందుకు అతడి తండ్రి జి. పెంటయ్య, ఎన్ నాగభూషణంలకు విక్రయించాడు. అయితే జైలు నుండి బయటకు వచ్చిన భిక్షపతికి భూముల ధరలు విపరీతంగా పెరగడాన్ని గుర్తించాడు.

తమ భూమికి చెల్లించిన డబ్బు కంటే మరింత డబ్బును చెల్లించాలని పెంటయ్యను డిమాండ్ చేశాడు. కానీ, ఆయన అందుకు నిరాకరించాడు. దీంతో పెంటయ్యను దెబ్బకొట్టాలని భిక్షపతి ప్లాన్ చేశాడు.

అదే గ్రామానికి చెందిన ఐదేళ్ళ చిన్నారిని బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి పెంటయ్య పొలం వద్దకు తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేశాడు.ఈ కేసును పెంటయ్యపైకి వేసేందుకు భిక్షపతి ప్లాన్ చేశాడు. అయితే చిన్నారిని తన వెంట తీసుకెళ్ళడం చూసిన గ్రామస్తులు భిక్షపతిని నిలదీయడంతో అసలు విషయం ఒప్పుకొన్నాడు.

దీంతో 2011 జూలై 11న తూఫ్రాన్ పోలీసులు నిందితుడు భిక్షపతిపై ఛార్జీషీట్ దాఖలు చేశారు. 2012లో భిక్షపతికి జీవిత ఖైదును విధిస్తూ సిద్దిపేట ఆరో అదనపు సెషన్స్ కోర్టు తీర్పును వెలువరించింది.

కింది కోర్టు చేసిన తీర్పుపై భిక్షపతి హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో భిక్షపతి ఉరి శిక్ష విధించాల్సి ఉండేదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు భిక్షపతి పిటిషన్‌ను కొట్టివేసింది.

English summary
Expressing anguish and deep concern at the prevailing situation in the country with regard to crimes against women and children, a division bench of the Hyderabad High Court has opined that the executive governments of the states should introspect and take all measures which would effectively curb the menace
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X